అ న్యోన్యత అంటే ఒక పరస్పర ప్రయోజనం. ఇది వ్యక్తుల మధ్య అవగాహనలతో ఏర్పడుతుంది మరియు నిలుస్తుంది. ముఖ్యంగా ఇది జాస్తీగా సరైన భాగస్వాముల నడుమ అగుపిస్తుంది. ఒక వ్యక్తి తన భాగస్వామి రాక ముందు తనలా తాను మెసులుకోవచ్చు. కానీ తనకు భాగస్వామిగా చేరిన వ్యక్తి చెంతన తను సర్దుబాటుతనం చేపట్టాలి. అదే అన్యోన్యత సూత్రం. ఇదే ప్రమాణిక భాగస్వామిగా చేరిన ఆ మరో వ్యక్తికి కూడా సమంగా వర్తిస్తుంది. భాగస్వాములు కాబోవు వారు ఇది తమ తమ యాదల్లో పెట్టుకు మెసులుకోగలగాలి. అట్టి భాగస్వాములే అన్యోన్యతకి మచ్చుల్లా మన్ననలు పొందుతారు. ఈ అన్యోన్య సరళి సరళమైన బంధం మధ్య సహజంగా కానవస్తుంది. తోడు నీడల్లా మెసులుతూ తమ మధ్య బంధాన్ని ముందుకు సాగిస్తుండే వ్యక్తుల చోట ఈ అన్యోన్యత చక్కగా తచ్చాడుతుంది. తొలుత వ్యక్తుల మధ్య పరిచయంతో మొదలైన ఈ అన్యోన్య బంధం వాళ్ళు కాటికి చేరే వరకూ తరలి వస్తుంది. వాళ్ల తనువులు మరుగయ్యాకనే తల ఒగ్గుతుంది. నిగ్రహం , సహనం లతో అన్యోన్యత కలకాలం ఒక మచ్చుగా కొనయాడబడుతుంది. అనుమానం అన్యోన్యతకి అవరోధం. అహం అన్యోన్యతకి అగాథం. అసమానత అన్యోన్యతకి ఆటంకం. వివాదం అన్యోన్యతకి విఘాతం. మనస్పర్థ అన్యోన్యతకి మాయని మచ్చ. రాజీ చేష్ట అన్యోన్యతకి పూల బాట. ***
Post Date: Thu, 01 Dec 2022 04:53:31 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 01 Dec 2022 04:53:31 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment