Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 21 January 2023

పంచపాషాణ పద్యాలలో మరొకటి - ఏ.వి.రమణరాజు

పంచపాషాణ పద్యాలలో మరొకటి సాహితీమిత్రులారా! పంచ పాషాణా లలో ఇది మరొక పద్యం భండనభీమ నిన్నెదిరి పారక నిల్చిన శాత్రవుల్ బృహ న్మండలపుండరీక హరి,నాకనివాసులు పారియున్ బృహ న్మండల పుండరీక హరినాక నివాసులు చచ్చియున్ బృహ న్మండల పుండరీక హరినాక నివాసులు చిత్ర మెన్నగన్ అర్థము:--భండనభీమ =యుద్ధమునందు శత్రువులకు భయము గలిగించు వాడా!, నిన్ను,ఎదిరి =ఎదిరించి పారక=వెన్నిచ్చి పరుగెత్తక, నిల్చిన శాత్రవుల్ =పగవారు బృహ=గొప్పవైన, మండల =గుండ్రములైన, పుండరీక=వెల్లగొడుగుల తోడ, హరి=గుఱ్ఱము మీద, నాక=సుఖముగా, ని-మిగుల వా=తిరుగుటకు ఆస=స్థానమైన,పారియున్ =పారిపోయియు, బృహత్ = గొప్ప, మండల=ఒక రకమైన పాములకు, పుండరీక=పులులకు, నాక =అడవి నేలలందు, ని=పోయిన, వాసులు =కట్టుబట్టలు గలవారై యుందురు. చచ్చియున్=చనిపోతే,బృహ=విశాలమైన, మండల=ఎర్రనైన, పుండరీక=కమలముల వంటి. హరి=సూర్యుని యందు నాక=వైకుంఠ మందును నివాసులు=ఉండువారు. ఓ! భండనభీమా!యుద్ధములో నిన్నెదిరించి పరిగెత్తి పోక నిలిచి పోరాడి తాళలేక గుర్రాలమీద పరిగెత్తి పోయి  పుట్టగొడుగులు, పాములు,పులులు గల అడవిలో కట్టు బట్టలతో తిరుగుచుందురు.యుద్ధములో చనిపోయిన వారు సూర్యమండలము లేక వైకుంఠమునందు చేరుదురు.ఎలా చనిపోయినా వీరమరణం పొంది స్వర్గలోకాన్ని చేరుతారు.అని భావము ( బృహన్మండల పుండరీక-దగ్గరే నానార్ధకమైన శ్లేష!1అడవులపాలవుతారు 2 పారిపోక యెదిరిస్తే వీరమరణంపొంది సూర్యమండలాన్ని అధిగమించి నాకలోక సుఖాలననుభవిస్తారని భావం! ఇదోగమ్మత్తు!)
Post Date: Sat, 21 Jan 2023 14:25:48 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger