Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 15 January 2023

ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం: ముద్రాలంకారాలు - ఏ.వి.రమణరాజు

ప్రబంధరాజవేంకటేశ్వర విజయ విలాసం:  ముద్రాలంకారాలు సాహితీమిత్రులారా! ప్రబంధరాజంలో ముద్రాలంకార చమత్కారవిశేషాలు వివిధ పద్యాలలో దర్శనమిస్తాయి. ప్రస్తుతార్థాన్ని  ఇచ్చే  పదంచేత సూచ్యార్థ సూచనం  ఉంటే  ముద్రాలం కారం . సూచ్యార్థం అంటే సూచింప దలచిన అర్థం. 1.అర్ణవ దండకం: ప్ర.రా.వేం.వి.విలాసంలో 148వ పద్యం అర్ణవదండకం.ఈదండకంలో శ్రీవేంకటే శ్వర స్వామివారు "సంసార ఘోరార్ణవో త్తారణా" అని స్తుతించబడినాడు. ఈ దండకం పేరు _అర్ణవ_దండకం.దండక భేదం పేరును సూచ్యార్థంగా ప్రయోగిం చినాడుకవిగారు,కనుక ఇది ముద్రాలంకారం. 2.మత్తేభవిక్రీడిత:  జలక్రీడాభివర్ణన సందర్భంగ కవిగారు-- మ.వనజాతాక్షియురోజకుంభములతో వర్తించురోమావళీ ఘన హస్తస్థితిలో గన న్మకరికల్ ఘర్మాంబులన్ దోcగ జా ఱిన గస్తూరిమదంబుతోcదళుకుమీ ఱెన్ హార పద్మాభతో మనముప్పొంగcగడిగ్గెcదత్సరసికిన్ మత్తేభవిక్రీడితన్ మత్తేభవిక్రీడిత పద్యంలో హృద్యంగాసూచ్యార్థం చేయడం ముద్రాలంకారం. 3.వనమయూర: అబలలకు తలవెంట్రుకలు జారి కటిసీమను కప్పివేసినవి జలకేళిలో వనమయూరాల వలె తాండవం చేస్తున్నారని ముద్రాలంకారంగా 'వనమయూర'  వృత్తంలో వర్ణించినారు కవిగారు, కవిగారు---- వనమయూర వృత్తం: చండగతి పెన్నెఱులు- జారి కటిసీమన్ మెండుకొని గప్ప కడు- మీఱి జలకేళిన్ దాండవము సల్పెడు వి-ధంబునను నీటై యుండి రబలల్  వనమయూరము ల  రీతిన్ 4.ఉత్పలమాల: ఉ.ఏమని యెంచవచ్చుc బ్రస- వేషు శరాసన తాపవేదనన్ వేమఱుcగుందుచో సఖులు-వేగ బ్రఫుల్ల సరోజమాలికా స్తోమము మేనcదాల్ప నవి- తోడనె కంది విచిత్ర భంగియై భామ యురోజసీమc గను- పట్టెను నుత్పలమాలికా కృతిన్ భామలపై మన్మథుడు పూల బాణాలు వేసినాడు. అవి సరోజమాలి కలవలె ఆమె మేన ఉన్నాయి. అయితే అవి  కందిపోయి  "ఉత్పలమాల" ఆకృ కృతిలో కనిపించినవి. ఉత్పలమాలిక పద్యంలో ఉత్పలమాలాకృతి చెప్పడం సూచ్యార్థం,కనుక ఇదిముద్రాలంకారం. 5.మానినీ నిబ్బరమైనది నెక్కొను వేదన- నిల్పదలంపుచు నేర్పులచే నబ్బురమంద రయానకొనర్చిన- వన్నియు నిష్ఫల మౌచును బో నుబ్బిన కాcకకు నోర్వక ఱెప్పల- బొయ్యన వ్రాల్చుచు నుస్సురనన్ గబ్బి సఖుల్ తటకాపడి మానిని గన్గొని పల్కిరి కర్జముగాన్ ఒక మానిని వేదనను నిల్పుచేయాలని ఆమె సఖులు  ప్రయత్నించినారు. ఈ విషయాన్ని   _మానిని_   వృత్తంలో చెప్పడం ముద్రాలంకారం. 6.మత్తకోకిల: కాంతలు శోభనగాథలను మత్తకోకిల రీతులుగా అందరూ జతగూడి పాడి నారని మత్తకోకిల పద్యంలో చెప్పట ముద్రాలంకారం.ఆ పద్యం ----- మత్తకోకిల గానవైఖరినందు కొందరు- కాంత లయ్యెడc జేరి సో బానయంచొక పాటcబాడగ- బాడినంతనె వింతయై గానుపింపcగc బూర్వశోభన  గాథలెల్లను మీఱcగా మానినుల్ కవగూడి పాడిరి- మత్తకోకిల రీతులన్ 7.ఆటవెలది వింగళించి"యాటవెలcది " చందంబున కోపులందుమీఱి యేపుతోన మిత్రగణములతి విచిత్రతంబై కొన దైవగణము లెదురcదారసించె. ఆటవెలది అని పద్యం పేరునుపేర్కొన డమే కాక మిత్రగణాలు,దైవగణాలూ పేర్కోవడం చిత్రం. 8.భాస్కరవిలసిత : పంకజదళనిభలోచన- శంకాభావమునిహృదయ- సతతవిహారా కుంకుమ మృగమద సాంకవ- పంకోరస్థలకృతపద- వననిధి కన్యా లంకృత మణిగణభూషణ- యం కీకృతమృదుగతిమరు- దసితశరీరా వేంకటగిరివర రుచ్య క- లంకా భాస్కరవిలసిత లగదరి హస్తా పై పద్యంలోరెండు కందపద్యాలుకూడ గర్భితం.పద్యనామం నాలుగవపాదం చివరన ఉంది,ముద్రాలంకారం. చమత్కారంగ పద్యనామం  కూడ   వర్ణిత  భావంలో   పొదగడం ముద్రాలంకారం.ఇదొక చిత్రకవితా  విశేషంగ కూడ పండితవర్య కథనం. ప్ర.రా.వేం.వి.విలాసంలో ఎనిమిది ముద్రాలంకారాలు ఉన్నాయి. వైద్యంవేంకటేశ్వరాచార్యులు సౌజన్యంతో
Post Date: Sun, 15 Jan 2023 13:24:41 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger