మొగుడు ముండా అంటే మాదాకవళం వాడూ ముండా అంటాడు. ఇదిఒక నానుడి. ఒక కత చెప్పుకుందాం అనగనగా ఒక పల్లెటూరు. ఆఊళ్ళో ఒక కుటుంబం, భార్య,భర్త, వారికొకడేకొడుకు.ఇలా ఉం డగా భర్త కాలం చేయడంతో,పిల్లవాణ్ణి పెంచుకుంటూ కాలక్షేపం చేస్తూ వచ్చిందా ముసలమ్మ. కొడుకు ప్రయోజకుడు కాలేకపోయాడు, చదువు సంధ్యలూ అంతంత మాత్రమే అయ్యాయి. కొడుకు పెద్దాడయ్యాకా ఒక పడుచును చూసి పెళ్ళిచేసింది. పెళ్ళైన తరవాతగాని మొగుడి నిరవాకం తెలియని పడుచు, చేతకాని మొగుడుకంటే చెడ్డమొగుడే మేలు, ఏం చెయ్యగలనిప్పుడనుకుని సంసారం గుట్టుగా నడుపుకొస్తూ ఉంది. ఒక రోజొక మాదాకవళం వాడు గుమ్మం దగ్గర అరుస్తున్నాడు, ''మాదాకవళం తల్లీ'' అని. భర్త భోజనం చేస్తున్నాడు, చివరికొచ్చేసింది, ''మళ్ళీ రా'' అనడం ఇష్టం లేక ఆ పడుచు ''ఒక నిమిషం ఉండూ'' అని అరిచింది. ఐనా వాడు అరుస్తూనే ఉన్నాడు. ఆమె భోజనం కానందున సద్దుకోవడానికి కొంచం సమయం పట్టింది. భోజనం చేసి బయటికి వెళ్ళిన ఇతను "ఒసే! ముండా ఎంతసేపుండాలే వీడూ"అనరిచాడు లోపలికి. పాపమా పడుచు మాదాకవళం తెచ్చి, మాదాకవళం వాడిజోలెలో వేసింది, మరో మాట మాటాడక. మరో నాలుగు రోజుల తరవాత కూడా అలాగే జరిగింది. ఆ తరవాత మాదాకవళం వాడే ''ముండా! ఎంతసేపు ఉండాలే'' అని అరచాడు. పడుచు మాటాడలేదు, జోలెలో కవళం వేసి వెళ్ళిపోయింది, లోనికి. ఇప్పుడు అతని తల్లి కలగసేసుకుని, నువ్వు రెండు సార్లు నీ భార్యను ముండా అని మాదాకవళం వాడి ముందంటే , మాదాకవళాని కొచ్చినవాడూ ముండా అన్నాడు, చూసావా! నీకు నీ భార్య మీద పైచెయ్యి సాధించాలంటే ఇది పద్ధతి కాదు,నీకూ నీ భార్యకూ తేడాపాడాలుంటే నాలుగు గోడల మధ్యన తేల్చుకో వీధినకాదు. వాడు ఈ రోజు నీ భార్యను ముండా అన్నాడు, రేపు నిన్నూ తిడతాడు, ఆపై నన్నూ తిడతాడు. ముష్టివాడు తిడితే నీ పెళ్ళానికొచ్చిన లోటేం లేదు,నీ పరువే పోయింది. కాని ఇది పదిమందికీ తెలిసి నీ చేతకానితనమే బయట పడింది. గడ్డిపోచ విలువ చెయ్యని ముష్టివాడికిచ్చిన పాటి విలువ,గౌరవం, నీ భార్యకివ్వలేక పోయావు. నీకు తెలివితేటలెప్పటికొస్తాయో! నీకు వయసు పెరిగిందికాని బుద్ధి పెరగలేదని తిట్టింది.
Post Date: Fri, 27 Jan 2023 03:25:46 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 27 Jan 2023 03:25:46 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment