Google, microsoft ఇంకా Amazon వంటి దిగ్గజ సంస్థలు లే ఆఫ్ ప్రకటించడం తో అమెరికా లో వేలాదిమంది భారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. వీళ్ళందరూ తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడమే కాకుండా వీలైనంత త్వరలో మళ్ళీ ఏదో ఇతర కంపెనీల్లో పని వెదుక్కోవలసిన స్థితి ఏర్పడింది.వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించిన దాని ప్రకారం దాదాపు రెండు లక్షల మంది ఐ.టి. ఉద్యోగులు గత నవంబర్ నుంచి ఇప్పటిదాకా రోడ్డున పడ్డారు.గూగూల్,మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్,అమెజాన్ కంపెనీల్లో ఐతే రికార్డ్ స్థాయిలో ఎప్పుడూ లేనంతమందిని తొలగించారు. వీరిలో చాలామంది H-1B,L1 వీసాల మీద కొనసాగుతున్నారు. దీంట్లో H-1B వీసా అనేది అమెరికా లోని సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు గా కొనసాగడానికి పనికి వస్తుంది తప్పా ఇమ్మిగ్రేంట్ వీసా గా పరిగణించరు.అదీ ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులు గా మాత్రమే H-1B వీసా పై రావచ్చును.చాలా సంస్థలు దీన్ని నెపం గా పెట్టుకుని వేలాదిమందిని ఇండియా,చైనా వంటి దేశాల నుంచి హైర్ చేసుకున్నాయి. ఇక L-1Bవీసా అనేది తాత్కాలిక ప్రాతిపదికన ఆయా సంస్థల మధ్య ట్రాన్స్ ఫర్ మీద వచ్చే మేనేజీరియల్ స్థాయి వారికి మాత్రమే సంబంధించినది. మన దేశానికి సంబందించిన ఐ.టి. నిపుణులు ఎక్కువగా ఈ రెండు వీసాల మీదనే ఆధారపడి అమెరికా లో పనిచేస్తున్నారు. వీరు ఎక్కువకాలం ఉండాలంటే సాధ్యమైనంత త్వరలో అంటే ఈ ఏప్రిల్ నెల లోగా వేరే కంపెనీల్లో ఉద్యోగం చూసుకోక తప్పదు. ఈ మార్చ్ నెల 20 తేదీ ఆఖరు పని దినం గా ఉన్న ఓ ఉద్యోగిని మాట్లాడుతూ హెచ్ వన్ బి వీసా ఉన్నవారు మరో అరవై రోజుల్లో ఇక్కడ జాబ్ చూసుకోకపోతే తిరిగి ఇండియా వెళ్ళడం తప్పా మరో దారి లేదని చెబుతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ సంపాదించడం కూడా కష్టం గానే మారింది. --- NewsPostNetwork
Post Date: Thu, 26 Jan 2023 08:16:47 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 26 Jan 2023 08:16:47 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment