Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 27 February 2023

పోటీ లేని "టీ" - గోలి హనుమచ్చాస్త్రి

కందము మేటిగ నుండును రుచులన్ చేటుల్ కలుగంగ బోవు సేవించగ, మీ రే, "టీ" నే త్రాగండయ పోటీ పానీయమేది పుడమిని జూడన్. కందము: నీరును కాళ్ళకు, త్రాగెడు నీరును నీవీయకున్న నిందించరు, తే నీరును, వచ్చిన యతిథికి తీరుగ నీ వీయకున్న దెప్పుదురిలలో. ఆటవెలది: అల్లము మరి సొంఠి, యావాలు, నిమ్మయు బ్లాకు, వైటు, గ్రీను, బాదములును రకములెన్నొ గలవురా! త్రాగు "టీ" లలో దేనికదియె రుచుల దెలిసికొనుము. ఆటవెలది: చదువుకొనగ నిచ్చు సహనమ్ము "తేనీరు" కష్టజీవి శక్తి గాచు "టీ"యె ఉస్సురనెడువారి కుత్సాహమీ "చాయి" బ్రతుకు తెరువు జూపు భాగ్యశాలి.
Post Date: Mon, 27 Feb 2023 02:18:49 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger