Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 3 February 2023

కవిసింహ పోకూరికాశీపతి - ఏ.వి.రమణరాజు

కవిసింహ పోకూరికాశీపతి సాహితీమిత్రులారా! కవిసింహ పోకూరి కాశీపతి జననం:ఫిబ్రవరి-1893,బోదెలవీడు,పల్నాడుతా. కీ.శే:తే27-12-1974, మాచర్ల ప్రథమ అష్టావధానం:నరసరావుపేట1916 అనేక అవధానాలు వివిధప్రాంతాలలో. నరసరావుపేట,ఉయ్యూరు,గద్వాల రచనలు:అరవై చేసినట్లు తెలుస్తోంది. లభ్యరచనలు: 1.నిరోష్ఠ్య నిర్వచన శుద్దాంంధ్రహరిశ్చంద్రోపాఖ్యానం 2.సారంగధరీయం-త్య్రర్థికావ్యం 3.సిద్ధయోగి చరిత్ర 4.శౌరిశైశవలీల , పంచవర్గాక్షర రహిత రచన 5.అలివేలుమంగా వేంకటేశ్వరసంవాదం 6.వీరతిమ్మమాంబచరిత్రం 7.సుజ్ఞానప్రబోధిని 8.సునీతిశతకం 9.కేశవేంద్రశతకం 10.మన్నెముకొండవేంకటేశ్వరశతకం(ఏకప్రాస) 11.హనుమత్ప్రభుశతకం(హలహర్వి హనుమంత రెడ్డిని గురించినశతకం) 12.నారసింహప్రభుశతకం 13.శ్రీమల్లేశ్వరశతకం 14.నరసింహనిరసనస్తుతి 15.సత్యనారాయణ వ్రతకల్పం 16.త్రింశదర్థపద్యరత్నం 17.కాశీపతి చమత్కృతి 18.వివిధ సందర్భాలలో చెప్పిన చాటుపద్యరత్నాలు 19.కాఫీదండకం (ఆశువు) మిగత రచనలనుగురించి అన్వేషణ చేయవలసిఉంది. బిరుదాలు: కవిసింహ,   కవిజటిల,  కవిశోరోమణి,    కవితాప్రవీణ, ఆశువికోకిల,    ఆశుకవిపుంగవ,  కవిశిఖామణి,     అవధానప్రవీణ, చిత్రకవిత్వపంచానన, కళాపరిపూర్ణ,     మహాకవిశేఖర సన్మానాదులు: కనకాభిషేకం గండపెండేరసన్మానం గజారోహణం రథోత్సవం స్వర్ణకంకణప్రదానాలు ద్రవ్యబహూకరణలు రాష్ట్రపతి డా.రాధాకృష్ణన్ చే సన్మానం వీరినిగురించి కొంత  పరిశోధన జరిగింది. విద్వద్గద్వాలసంస్థానకవివర్యులుగా ఉండినారు.మరెన్నో సంస్థానాలలో సదస్సులలో స్వీయ కవితా ప్రదర్శనంచేసి సత్కారాలు పొందినారు ఇంకా ఎంతో పరిశోధనజరుగవలసిఉంది కవిసింహగారి రచనలన్నీ విడివిడిగానూ, ఒకే బృహత్సంపుటంగాను ప్రచురితం కావలసి ఉంది. దీనికోసం ఎవరైన కంకణబద్ధులై కార్యోన్ముఖులుకావలసి ఉంది రచన:వైద్యంవేంకటేశ్వరాచార్యులు
Post Date: Fri, 03 Feb 2023 13:16:40 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger