Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 15 February 2023

చ్యుతాక్షర చిత్రం - ఏ.వి.రమణరాజు

చ్యుతాక్షర చిత్రం సాహితీమిత్రులారా! కాశీపత్యవధానులవారి చ్యుతచిత్రం చ్యుతం అంటె జారినది లేదా తీసివేయబడినది చ్యుతాక్షరం అంటె తీసివేయబడిన అక్షరం గమనించండి- ఇది సారంగధరీయం ద్వితీయాశ్వాసం 41 పద్యం కుధర సమా కృతి లాభ మ్మధికముగా గొనె గుచద్వయం బొండొండా కుధ ముఖ లిపులు సనినగ ట్యధర దృగం గోక్తి నాసికాస్య నఖముల్ కుధర సమాకృతి లాభము = పర్వతమునకు సమానమైన ఆకృతిని,(కుచములు) ధర సమాకృతీ లాభము=భూమికి సమానమైన ఆకృతి (పిరుదులు) రసమాకృతి లాభము=అమృత సంపదవంటి రూప ప్రాప్తిని (ఆధరము ) సమాకృతి లాభము= ఎగుడు దిగుడుగాని రూప ప్రాప్తిని (దృక్కులు) మాకృతి లాభము=లక్ష్మీదేవి వంటి ఆకార ప్రాప్తిని,(అంగములు) కృతి లాభము=కావ్యరచనా రూపాన్ని అంటే చమత్కారాన్ని(ఉక్తులు) తి =నువ్వుపువ్వు వంటి దీప్తిని (నాసిక) లాభము= చంద్రుని (లః) వంటి కాంతిని (అస్యము) భము =నక్షత్రాతిశయమును (నఖములు) 'కుధర సమాకృతి లాభము' అనే దానిలో ఒక్కొక్క అక్షరాన్ని తీసి వేస్తూ పోతే అవి వరుసగా - కటి, ఆధరము, దృక్కులు, శరీరం, ఉక్తి, నాసిక, ఆస్యము, నఖములు అనే వాటితో సరిపోతాయని దీని అర్థం.
Post Date: Wed, 15 Feb 2023 15:28:35 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger