Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 7 February 2023

ద్విపద కందగుప్తం - ఏ.వి.రమణరాజు

ద్విపద కందగుప్తం సాహితీమిత్రులారా! కందపద్యంలోనే ద్విపద గుప్తంగ ఉండే రచనను  ద్విపదకందగుప్తం అంటారు.అంటే కందపద్యం ద్విపద లక్షణంకూడ కలిగిఉంటుంది. ఈ  కింది కంద ద్విపద గణాది లక్షణాలను నిశితంగ పరిశీలిస్తే ద్విపద కందగుప్త రచనలో ఉండే కిటుకు తెలుస్తుంది. క.కలువలదొర మానికముల దళంపు తలపుల నెపుడును-దగలోగొనగన్ గల తరగల పాలకడలి చెలంగు చెలువుని నిను గొలి-చెద లోకమునన్. పై కందంలో గుప్తమైన ద్విపద: కలువలదొరమాని-కములదళంపు తళుకులనెపుడును-దగ లో గొనగను గల తరగల పాల-కడలి చెలంగు చెలువుని నిను గొలి-చెదలోకమునన పై పద్యం గణపవరం వేంకటకవి రచించిన "ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసం"(143)లో ఉంది. వైద్యంవేంకటేశ్వరాచార్యులు గారికి ధన్యవాదాలు
Post Date: Tue, 07 Feb 2023 14:13:06 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger