వీడియో చూసారా! నాకనిపించినది. కన్య వరుని మెడలో మాల వేసింది.హుందాగా స్వీకరించాడు. వరుడు మాల వేసేలోగా ఏదో ఇబ్బంది, అందుకు కన్య వరుణ్ణి సున్నితంగా హెచ్చరించింది, కర్తవ్యాన్ని, చేతిని సున్నితంగా తాకడం ద్వారా. చిక్కును విడతీయడానికి సాయపడింది. ఆనందంగా వంగి మాల స్వీకరించింది, వంగాలసిన అవసరం లేకున్నా! ఆపై కన్య వరుని కాళ్ళకి నమస్కారం చేసింది. వరుడూ కన్య కాళ్ళకి నమస్కారం చేసాడు, పైనుంచి మరోమాట వినిపిస్తున్నా! ఆ తరవాత కన్య మొహంలో గొప్ప అనుభూతి,భావోద్వేగం కనపడ్డాయి. పక్కవారెవరూ లేకుంటే ఒక్కసారిగా భర్తను వాటేసుకునేదేనేమో అనిపించింది. వీరి జీవితం మూడు పూవులు ఆరుకాయలే! నాకనిపించింది, ఇద్దరి మధ్య ఒద్దిక ఉంటే రానేరావు పొరపాట్లు, చేతులు కలిసిన చప్పట్లు, మనసులు కలిసిన ముచ్చట్లు, సినీకవి మాట నిజం,నిజం, నిజం. అంతేకాదు వరుడు నిజంగా తిక్కమొగుడే! భార్య అంటే అంత ప్రేమ, అభిమానం, ఆమెకోసం ఏం చెయ్యమన్నా చేసేస్తాడు, అంతే. దీవిద్దాం దీర్ఘాయుష్మాన్భవ. దీర్ఘ సుమంగళీభవ.
Post Date: Mon, 27 Feb 2023 03:51:07 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 27 Feb 2023 03:51:07 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment