Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 7 May 2023

అరటాకెళ్ళు ముల్లుమీద పడ్డా...... - sarma

అరటాకె ళ్ళి  ముల్లుమీద పడ్డా..... అరటాకె ళ్ళి  ముల్లుమీద పడ్డా, ముల్లెళ్ళి అరటాకుమీద పడ్డా   అరటాకుకే నష్టం  !!! ఇదో పాతకాలపు నానుడి. ఆ కాలంలో ఆడపిల్లతో మగవాడు మాటాడితే ఆడపిల్ల బతుకు బండలైపోతుందనీ, పాడైపోతుందనీ, అలాగే మగవాడు ఆడపిల్లతో మాటాడినా ఫలితం అలాగే ఉంటుందనీ చెప్పేవారు.  ఆ తరవాత ఆడపిల్ల వీపు సాపు చేసేవారు.  ఇదే లోక పు తీరు, నాడు. కాని రోజులు మారాయి. రోజులు మారాయా! లేదు!! అవే సంవత్సరాలు,అవే ఆయనాలు, అవే ఋతువులు, అవే మాసాలు, అవే పక్షాలు, అవే వారాలు, అవే గంటలు, నిమిషాలూన్ను. మరి మారిందేంటీ? మనిషి బుద్దులు మారాయి. ఇప్పుడు మగాడు ఆడపిల్లతో మాటాడినా, ఆడపిల్ల మగాడి  వెంటపడినా,వేధించినా, మాటాడినా, పగిలేది మగాడి వీపే. వాడే వయసువాడైనా, ఏమి మాటాడినా, లోకం వినదు. మగాడి వీపు పగలడం ఖాయం. ఆడవారితో దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిది. తస్మాత్ జాగ్రత,జాగ్రత.
Post Date: Sun, 07 May 2023 03:14:40 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger