Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 3 June 2023

"సిస్టర్" నర్స్ - గోలి హనుమచ్చాస్త్రి

12 మే 2023  ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా  అమరావతి సాహితీ పీఠం (శ్రీ రావి  రంగారావు గారు) గుంటూరు వారు నిర్వహించిన పోటీకి నేను పంపిన పద్యాలు.(ఈ బుక్ "తెల్లపావురాలు" లో ప్రచురించినారు) "సిస్టర్" నర్స్ కందము: దైవమె వైద్యుడు పుడమిని దేవుని దూతలు నిజముగ తెలియగ నర్సుల్ సేవల జేయుచు రోగుల "చావక" బ్రతికించబూను "శక్తులు" వీరే. ఆటవెలది: : చెల్లిగాని చెల్లి యెల్లరు నరులకు అక్కగానియక్క యక్కరలకు సోదరీమెయగుచు "సో' దరి నిలచును సిస్టరనగ తాప్రసిద్ధినొందె. ఆటవెలది: పుట్టి కళ్ళు తెరచి పుడమి జేరుటనుండి మట్టిలోన గలసి మడియు వరకు నట్ట నడుమ జీవనమ్మున రుజలందు సేవ జేయు మనల "సేవు" జేయు. తేటగీతి: మంచమున బడ తనవారు మరువ సేవ సమయ మింతయు లేదని సణుగు వేళ చెల్లి పోవుచు బంధముల్ చెడిన నాడు "చెల్లి" చూచును మనుజుల నొల్లననక. కందము: "సిస్టరు" సేవలు రోగికి "బూస్టరుడోసౌ"ను బ్రతుకు పొడిగింపంగా "బెస్టు"ర రోగము దులుపగ "డస్టరు" తానౌను, చిన్న డాక్టరు తానౌ. కందము: ఆ "నర్సు" సేవ మరువక "ఆనర్సు"ను సలుపవలయు నవనిని వినరా! "మేనర్సు" గలిగి నరులే "డోనర్సు"గ క్షేమమెంచుడు మరికనైనన్.
Post Date: Sat, 03 Jun 2023 03:49:58 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger