నిన్ననే నా మూడో సెమిస్టర్ సంస్కృతం పరీక్ష అయింది. "సంభాషణతః శాస్త్రపర్యంతం " course లోని "ప్రగత-భాష " level దాటాననిపించా. ఆ కబుర్లు తీరిగ్గా ఇంకెప్పుడైనా. కుదురుగా కూర్చుని చదువు చదవడం అంతగా అలవాటు లేకో చదువుగా చదివి చాలా రోజులయినందుకో చదివో - చదవకో చదవక చదవక - చదివో చదివీ - చదవకో చదవకపోయినా - చదివాననిపించో మొత్తానికి నాకు చాలా కష్టపడ్డట్టనిపించింది. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఇవాళ పొద్దున్న లేస్తూనే ఇంకివాళ బుఱ్ఱుపయోగించే ఏ పనీ చేయాలనిపించలేదు. అందుకే ఆఫీసుకి సెలవు పెట్టేశా. తెల్లటి ఇడ్లీలు మూడు తిని, ఒక బుల్లి గ్లాసులో బ్-రూ కాఫీ తాగేశా. ఓ మూడు పుస్తకాలు కొంచెం కొంచెం చదివా... *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** ఆ తర్వాత తీరిగ్గా వంట మొదలుపెట్టా. ఉల్లిపాయలేసి పప్పులుసుని ఉత్సాహంతో పొంగి పొర్లేలా చేశా. ఇంతలో బుజ్జిజింకగాడు వాడి laptop పట్టుకుని వంటింట్లోకి వచ్చేశాడు. "హాయ్ నాన్నగాడూ! నేనొకద్దాన్నే వున్నానూ అని కబుర్లు చెబ్దామని వచ్చేశావా?" వుడికించిన చేమదుంపలు వలుస్తూ అడిగా. "Yeah!" అంటూ dining table దగ్గర కూర్చున్నాడు జింకిరణ్. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నేనేమో వలిచిన చేమదుంపలని అతి జాగ్రత్తగా - ముందు చక్రాలుగా - తర్వాత అరచక్రాలుగా - చివరికి పావుచక్రాలుగా - ముక్కలుముక్కలుగా కంచంలో పేర్చా. "అమ్మా! How does చేమదుంప taste?" బుజ్జిజింక ప్రశ్న. "ఓ ముక్క తిని చూడు - ఉప్పు వుండదు మరి" అన్నా. వాడో ముక్క మాత్రం తిన్నాడు. నచ్చిందన్నాడు. మళ్ళీ వాడి పనిలో వాడున్నాడు. నేనేమో stove మీద నూనెలో చేమదుంపలు దోరదోరగా వేయించడం మొదలుపెట్టా. ఒక వాయ వేయించడం అయిందో లేదో బద్రి భోజనానికి వచ్చేశారు. అప్పటికి వేగిన చేమదుంపలలో వెల్లుల్లి కారం వేసిచ్చాను. వాటికి తోడుగా పప్పులుసుతో పాటు బద్రి భోంచేసి - మళ్ళీ office work చేసుకోవడానికి పైకి వెళ్ళారు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నేనేమో బుజ్జిజింకతో ఏవో కబుర్లు చెప్తూ మిగిలిన చేమదుంపలు వేయిస్తూ వున్నాను. వాడు "చేమదుంప is smelling really good!!" అని ముక్కు పీలుస్తూ నా పక్కకొచ్చి నించున్నాడు. నేనెందుకో తల తిప్పి చూస్తే dining table మీద బద్రి పెట్టి వెళ్ళిన ముఘలాయి పాన్ డబ్బా కనిపించింది. "నాన్నగాడూ! ఆ డబ్బా కొంచెం అలమార్లో పెడతావా?" అనడిగా పక్కనే నించున్న బుజ్జిజింకని. వాడు సరేనని ఆ డబ్బా పట్టుకుని "Where does it go?" అన్నాడు. "అదుగో ఆ fridge పక్కనే ఆ చిన్న cupboard లో పెట్టెయ్" అన్నా. వాడు ఆ cupboard తెరిచి "Where, in here?" అనడిగాడు. "ఎక్కడోక్కడ place చూసుకుని పెట్టెయ్...నువ్వే రాశావుగా నీ college essay లో...'In our house, everything has its own place; it could be anywhere' అని. మర్చిపోయావా?" అంటూ నవ్వా. వాడు కూడా డబ్బా లోపల పెట్టేసి ముసిముసిగా నవ్వుకుంటూ వచ్చి నా పక్కన నించుని నేను చేమదుంపలు వేయిస్తుంటే చూస్తూ నించున్నాడు. *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** *** నేను నా మాటలు continue చేస్తూ "మనింట్లో గిన్నెలకూ, డబ్బాలకూ అస్సలు bore కొట్టదు తెలుసా!. ఎప్పుడూ కూడా ఒక్కచోటే వుంటున్నాము, nobody is taking us out anywhere అని complain చేయనే చెయ్యవు. ఎందుకంటే అవి ఒకసారి వున్నచోటికి మళ్ళీ వెళ్ళవు కదా!" అని నవ్వుతున్నా. వాడు కూడా నవ్వుతూ "Noone else talks to pots and pans as you do, అంమా!" అన్నాడు. (నిజం! బుజ్జిజింక "అమ్మా" అని పిలిస్తే "అంమా!" అన్నట్టుంటుంది.) వాడలా అనగానే నేను గొప్పగా feel అయిపోతూ "అవున్నాన్నా! I understand them. I know what thier heart says" అని ఇంకా నాకు మహాభారతంలో నకులుడికి అశ్వహృదయం తెలిసినట్టు నాకు Pots & Pans -హృదయం తెలుసని గొప్పలేవో చెబ్దామని అనుకుంటూ వున్నాను. ఇంతలో నా చెవి పక్కగా చిన్నగా వినిపించింది... మెరుపుకి ముందు వినిపించే చిఱు-ఉరుములా. "Yeah...at same intelligence level" తలతిప్పి చూసిన నాక్కనిపినిపించింది జింకకనుల నిండా పాకిన ఓ mischievous smile - వాన చినుకు మీద తళుక్కుమని మెరిసే మెరుపులా.
Post Date: Tue, 13 Jun 2023 03:57:48 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Tue, 13 Jun 2023 03:57:48 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment