ఏమిజన్మంబు? ఏమి జీవనము? ఏమిజన్మంబు? ఏమి జీవనము? ఈ మాయకాయంబు? ఏమిజన్మంబేమి జీవనము? పుట్టుకేంటి? పెరగడమేంటి? చావేంటి? మనిషికి మనిషిపుట్టడమేంటి? పండునుంచి పండు పుట్టడమేంటి? ఆడ, మగ తేడా ఏంటి?స్త్రీకే బిడ్డకలగడమేంటి? ఎందుకీ తేడా? ఆకలేంటి? అన్నమేంటి? అన్నం తింటే ఆకలి తీరడమేంటి?ఆలోచిస్తే ఇదంతా గందరగోళం. ప్రేమ అభిమానాలేంటి? ఎందుకు? అన్నీ కొచ్చన్లే. సమాధానాలు లేవు.... ఓరోజు సాయంత్రం ఆలోచన ఈ దారి పట్టింది.బయటికెళ్ళలేక లోపలుండలేని స్థితి. ఇంతలో మందస్మితవదనారవిందసుందరి,త్రిదశి, వచ్చి కూచుంది, "తాతాగారూ రేపు ఊరునుంచి వెళ్ళిపోతున్నానూ" అంటూ, బిక్కముఖంతో. అంతలోనే అసలీ కలవడమేమి?విడిపోవడమేమి? కారణం లేని కార్యం ఉండదంటారు కదా! అడిగింది. ఈ ప్రశ్నకి సమాధానం భారతంలో భీష్ముడు చెప్పారు, పద్యం గుర్తులేదు, భావం చెబుతా! గాలిచేత ఎగరగొట్టబడ్డ మేఘాలు గుంపుగా చేరతాయి, అదేగాలిచేత చెదరగొట్టబడతాయికూడా! అలాగే మానవులు విధి(చాలా అర్ధాలున్నాయి, ఈ మాటకి)చేత కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. ఓ చిన్న కొచ్చను సమాధానం చెప్పూ అన్నా! తన బిక్కమొహం చూడలేక!!! ఒక నాలుగొందల మీటర్ల వాకింగ్ ట్రాక్ మీద ఒకే చోటునుంచి ఇద్దరు గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకే సమయంలో బయలుదేరి ఎదురెదురుగా నడుస్తున్నారు. వీరుకలుస్తారా? ఎప్పుడు ఎక్కడ? అదేట్రాక్ మీద మరో ఇద్దరు కలిసి గంటకు నాలుగు కి.మి ల వేగంతో ఒకేవైపుకు నడుస్తున్నారు. వీరు కలిసినడుస్తారా? విడిపోతారా? అదే ట్రాక్ మీద ఒకడు గంటకు నాలుగు కి.మి ల వేగంతో నడుస్తున్నాడు. మొదటివాడు నడక మొదలెట్టిన రెండు నిమిషాల తరవాత రెండవాడు అదే చోటునుంచి, అదే వేగంతో అదే వైపుకి నడకమొదలెట్టేడు. వీరిద్దరూ కలుస్తారా? ఎప్పుడు?ఎక్కడా? ఈ కొచ్చన్లు విని మందస్మితవదనారవిందసుందరి మరింత బిక్కమొహంతో నేను లెక్కల్లో వీకూ అంది బెక్కుతూ!!! ఆలస్యమైతే తిక్కమొగుడు వచ్చి ఎత్తుకుపోతాడు, అంది నవ్వుతూ. ఎక్కడున్నాడు? అడిగా బయట కార్ లో కూచుని ఉన్నాడు, అందుకే కంగారు. బై అంది చెయ్యి ఊపుతూ. నువ్వు ప్రేమించబడ్డ చోట సుఖంగా ఉంటావు. నువ్వు ప్రేమించినచోట సుఖంగా ఉండలేవన్నా!బై చెప్పుతాతా అంది పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటూ. బై చెప్పను బై అనకు,వెళ్ళొస్తా అనాలి, అన్నా.మరికొంచంసేపు నిలిపి ఉంచడానికి. ఏం? అడిగింది.వెళ్ళొస్తా అన్నదానిలో మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, బైలో లేదు, అన్నా! "ఎల్పోయొస్తా" అంది నవ్వుతూ. నిజం ఇలా అనేవాళ్ళని చూసి నవ్వుతాం, నిజానికి ఇందులో ఎంత మళ్ళీ కలుస్తామనే ఆశ ఉంది, అన్నా! ఇంకీ సారి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది, "వస్తానూ" అంటూ, చిత్రం కదూ!!!
Post Date: Thu, 01 Jun 2023 03:38:20 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Thu, 01 Jun 2023 03:38:20 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment