Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 11 June 2023

తక్షకస్య విషం - sarma

తక్షకస్య విషం (ఆచార్య చాణుక్య) అగ్నిరాపః స్త్రియో మూర్ఖాః సర్పా రాజకులీన చ నిత్యం యత్నేన సేవ్యాని సద్యః ప్రాణహరాణి షడ్ నిప్పు,నీరు,మూర్ఖులు,స్త్రీలు,పాములు,రాజబంధువులు ఈ ఆరుగురితో నిత్యం జాగరూకతతో ఉండాలి. లేదా తక్షణ ప్రాణహాని జరగచ్చు. దూరస్థోఽపి న దూరస్థో యో యస్య మనసి స్థితః యో యస్య హృదయె నాస్తి సమీపస్థోఽపి దూరతః మనసుకు దగ్గరైనవారు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే. మనసుకు దూరమైనవారు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే దానేన పాణిర్న తు కంకణేన స్నానేన శుద్ధిర్న తు చందనేన మానేన తుష్ఠిర్న తు భోజనేన జ్ఞానేన ముక్తిర్న తు ముండనేన చేతులకి అలంకారం బంగారు గాజులు,మురుగులు,తోడాలు ధరించడం కాదు,దానమే అలంకారం.శుద్ది స్నానంతో అవుతుంది,చందనం ఒంటికి రాసుకోవడంతో కాదు. అర్హులకు భోజనం పెట్టడం తో  తృప్తినివ్వదు, సన్మానమే తృప్తినిస్తుంది. జ్ఞానంతో ముక్తి కలుగుతుందికాని, తలగొరిగించుకున్నంతలో  కాదు  .(సన్యాసంతీసుకున్నంతలో ముక్తిరాదు.) పరోక్షె కార్యహంతారం ప్రత్యక్షె ప్రియవాదినం వర్జయెత్తదృశం మిత్ర విషకుంభ పయోముఖం. ఎదుటగా పొగిడి, వెనక చెడ్డగా మాటాడి, పని చెడగొట్టే వారు(వెనక గోతులు తీసేవారు),  పాల పైపూతగల   విషపు కుండలాటి వారు. అటువంటి మిత్రునిలాటి వారిని వదిలేయాలి. విద్యా మిత్రం ప్రవాసేషు భార్య మిత్రం గృహేషు చ వ్యాధిస్తయోషధీ మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ పరాయి దేశంలో విద్య మిత్రుడు, ఇంటిలో భార్య మిత్రుడు (దేవుడిచ్చిన మిత్రుడు), వ్యాధితో బాధపడేవారికి మందు మిత్రుడు, చనిపోయినవారికి వారు చేసుకున్న ధర్మమే మిత్రుడు. వృధా వృష్టి సముద్రెషు వృధా తృపేషు భోజనం వృధా దానం ధనాఢ్యెషు వృధా దీపో దివాపి చ సముద్రం మీద వర్షం వృధా, (అప్పటికే అక్కడ చాలా నీరుంది), కడుపు నిండినవానికి పెట్టే భోజనం వృధా ( పెట్టిన దానిని తిన లేడు)డబ్బున్నవాడికి దానం చేయడం వృధా, (అపాత్ర దానం)పగలు దీపం వెలిగించడం వృధా ( సూర్యుని వెలుగుండగా దీపమెందుకు? అది దర్పం వెళ్ళబోయడమే) తక్షకస్య విషం దంతె మక్షికాయస్తు మస్తకె వృశ్చికస్య విషం పుఛ్ఛె సర్వాంగె దుర్జనె విషమ్ పాముకి పంటిలో విషం, ఈగకు తలలో విషం,తేలుకు తోకలో విషం,దుర్జనునికి అన్ని అంగాల విషమే తలనుండు వి ష ము ఫణికిని వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్ దలదోకయనకయుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ
Post Date: Sun, 11 Jun 2023 03:47:15 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger