(ఆచార్య చాణుక్య నీతి) సుఖస్యాఽనంతరం దుఃఖం దుఃఖస్యాఽనంతరం సుఖమ్ న నిత్యం లభతె దుఃఖం న నిత్యం లభతె సుఖమ్ సుఖాల తరవాత దుఃఖాలు, దుఃఖాల తరవాత సుఖాలు కలుగుతూ ఉంటాయి.ఎప్పుడూ దుఃఖమే స్థిరంగా ఉండిపోదు. అలాగే సుఖమూన్నూ స్థిరంగా ఉండిపోదు. పుస్తకస్తా తు యా విద్యా పరహస్త గతం ధనం కార్యకాలె సముత్పన్నె న సా విద్యా న తద్ధనం పుస్తకంలో ఉన్న విజ్ఞానము, ఇతరులచేతిలోని మనధనము అక్కరకు రావు (సమయానికి, అవసరానికి ఆదుకోవు) నృపస్య చిత్తం కృపణస్య విత్తం మనోరథా దుర్జనమానవానా స్త్రియా చరిత్రం పురుషస్య భాగ్యం దేవో న జానాతి కుతో మనుష్య రాజు మనసు,లోభివాని సంపద,దుర్జనుని కోరిక,స్త్రీ చరిత్ర,మగవాని సంపాదన, దేవునికైనా తెలియదు, మనుషులకా? రాజుమనసులో మాట గుట్టు, లోభివాని సంపాదనంతా గుట్టు,దుర్జనుని కోరిక గుట్టు, స్త్రీల చరిత్ర అనగా వయసు వివరాలు గుట్టు,పురుషుని సంపాదన గుట్టు. వీరంతా తమ గుట్టు దేవుడికి కూడా తెలియనివ్వక దాచి ఉంచుతారు, మనుషులకెలా తెలుస్తుంది? అని కవి భావం. అత్యాసన్నా వినాశాయ దూరస్థా న ఫలప్రదా సేవత్వం మధ్యభావేన రాజా వహ్ని గురు స్త్రియం రాజు,నిప్పు,గురువు,స్త్రీలు వీరు నలుగురికి అతి సన్నిహితంగా ఉంటే వినాశనమే, అలాగని దూరంగా ఉండి ఉపయోగం లేదు. అందుచేత మధ్యస్థ దూరంగా ఉండాలని ఆచార్య చాణుక్యుని మాట.
Post Date: Wed, 07 Jun 2023 03:00:12 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Wed, 07 Jun 2023 03:00:12 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment