Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 24 September 2014

ఇంతదూరం నడిచొచ్చాక -4 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఇంతదూరం నడిచొచ్చాక -4 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఇంతదూరం నడిచొచ్చాక -4

Posted: 23 Sep 2014 03:33 PM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~
నీ కోసమే
నీకు నాకు తెలిసిన పాటొకటి పాడుకుంటూ తిరుగుతున్నా

ఎక్కడికి పారిపోగలం
బాల్యంలో ఆ చివర నువ్వు, ఈ చివర నేను
క్రిందికి మీదికి ఊగినట్టు ఊగుతుంది మనసు

నిత్యం చూసే ముఖాల మధ్య
అక్కడే అతుక్కుపోవడం
ఎవ్వరూ గుర్తించని ముఖాన్ని తొడుక్కుని
ఎక్కడికో పారిపోవడం
నిత్యజీవనంలో ఏదైనా సాధ్యమే!

**

ముఖ కవళికలతో ఎవర్నో గుర్తించాననుకుంటాను
సమూహాలలో పడి ఎక్కడో ఏదొ మర్చిపోతాను

మట్టి పరిమళాన్ని గుర్తించాననుకుంటాను
సరికొత్త అత్తర్లు(స్ప్రేల)మధ్య నాసికను కోల్పోతాను

నాల్గక్షరాలను పాదాలకు చక్... పూర్తిటపా చదవండి...

ఆలోచనలు… వినిఫ్రెడ్ వర్జీనియా జాక్సన్, అమెరికను

Posted: 23 Sep 2014 12:09 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

వాళ్ళు నా ఆత్మని తూలికలదుప్పటిలో చుట్టారు

వెచ్చగా, హాయిగా ఉండేలా చూశారు

ఒక పాత పూజా కర్పటము వేసి

చక్కగా చెక్కిన కుర్చీలో జాగ్రత్తగా కూచోబెట్టేరు.

నా కాళ్ళకి బంగారు జోళ్ళు తొడిగేరు

అది బొటనవేలుదగ్గరా, మడమదగ్గరా నొప్పెట్టింది;

నా పాదాలు వయసు వాటాడి, అలసిపోయాయి,

ఎలా ఉన్నాయి అని అయినా అడగలేదు.

నేనిప్పుడేమయిపోయానో అని బెంగ వాళ్ళకి

నా కోసం కీచుగా అరుస్తూ వెతుకుతునారు;

పొడుగ్గా మొలిచిన గడ్డిదుబ్బుల్లో దాగున్నాను,

వాళ్ళు పక్కనుండి పోతుంటే నవ్వుతున్నాను.

.

వినిఫ్రె... పూర్తిటపా చదవండి...

దత్తపది - 45 (తల)

Posted: 23 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
'తల'ను నాలుగుపాదాలలో ఉపయోగిస్తూ
పూలతోటను వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

తెలుగులోనే మాట్లాడండి..

Posted: 23 Sep 2014 11:37 AM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
తెలుగు భాష లోనే మాట్లాడదాం, తెలుగు  భాషని నిర్లక్ష్యం చెయ్యొద్దు, బాగా అవసరం అనుకుంటేనే తప్ప ఇతర భాషల్లొ మాట్లాడవద్దు. మనకు తెలుగు వచ్చని గొప్పగా చెప్పుకుందాం. తెలుగు భాష తీయదనాన్ని ఆస్వాదిద్దాం.
... పూర్తిటపా చదవండి...

మహాలయ అమావాస్య (పెత్రమావాస్య)

Posted: 23 Sep 2014 10:43 AM PDT

రచన : Brahmana Sangam Waranal | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL

మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర...

Posted: 23 Sep 2014 10:42 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

మా అమ్మగారి నాగ పట్నం పట్టు చీర...

.

మా అమ్మ గారు 1932 లో నాగ పట్నం ఉన్నప్పుడు ఒకజారి చీర 7 రూపాయలకు 

.

కొన్నారు...అది పాత గిలితే 1950 లో ఇంటికి వచ్చి... పూర్తిటపా చదవండి...

దేవినవరాత్రులు

Posted: 23 Sep 2014 09:18 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఏ నెలలో అయితే ఉంటుందొ ఆ నెలను ఆశ్వీయుజమాసం అంటారు.శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 రోజుల కాలము అని అర్దం.ఇదే మొదటి పక్షం కూడా.దీనినే శుద్ధపక్షం అని కూడా అంటారు.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment