Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 8 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-పరుపు. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-పరుపు. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-పరుపు.

Posted: 07 Oct 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పరుపు. పరుపు అంటే పడుకోడానికి పక్కకి ఉపయోగించే సాధనం. నేడు తెనుగు అర్థంకావాలంటే ఇంగ్లీషులో చెప్పాల్సివస్తోందనుకుంటా, బెడ్ అని. ఒకప్పుడు పందిరిపట్టెమంచాలూ, నులకమంచాలూ, నవారు మంచాలూ వాడేవాళ్ళం వాటి మీద పడుకున్నపుడు మెత్తగా ఉండేందుకుగాను పరుపు వేసుకునేవారం కదా! అది ఆ రోజులలో దూది పరుపే అయి ఉండేది. బూరుగు దూదితో కూడా పరుపులు కుట్టించుకునేవారు, కాని ఇది మామూలు దూది అంత బాగోదు. హంసల ఈకలతో పడక ఏర్పాటు చేసుకునేవారట. వాటినే హంసతూలికా తల్పం అనేవారు. […]... పూర్తిటపా చదవండి...

“మన కుర్రాళ్లే” మూవీ గురించి నా ప్రసంగం ఇక్కడ..

Posted: 07 Oct 2014 11:50 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
"మన కుర్రాళ్లే" ఆత్మీయ కలయికలో నా ప్రసంగం ఇది.. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని ఆన్ లైన్ లో http://www.manakurralle.com/ సైట్ లో వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రొటీన్ సినిమాలతో విసుగెత్తిపోయిన వారిని ఖచ్చితంగా ఆకట్టుకునే ఈ సినిమా అస్సలు మిస్ అవకండి. – నల్లమోతు శ్రీధర్... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 13

Posted: 07 Oct 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
మొదటిపాదంలో కవర్గాక్షరాలను, రెండవపాదంలో చవర్గాక్షరాలను, 
మూడవపాదంలో తవర్గాక్షరాలను, నాల్గవపాదంలో పవర్గాక్షరాలను ఉపయోగించకుండా
భారతమాతను స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

చంద్ర గ్రహణం జాగ్రత్తలు

Posted: 07 Oct 2014 10:03 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
(8-10-2014) చంద్ర గ్రహణం సందర్భంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి. గ్రహణ సమయంలో మధ్యాహ్నం 2-44 నిమి| నుంచి సాయంత్రం 6.04 నిమి| వరకు. సంపూర్ణ గ్రహణ సమయం మ| 3.55 నుంచి సా| 4.53| వరకు

గ్రహణసమయానికి 6 గంటల ముందు నుంచి ఆహారం తినకూడదు.

చిన్నపిల్లలు, ముసలివారు, రోగులు మాత్రం గంట ముందు నుంచి ఆహారం తినడం నిషిద్ధం.

ఉదయం 10 గంటలలోపు పూజాదులు ముగించుకుని భోజనం చేయాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తినండి. తేలికైన ఆహారం తీసుకొవడం మంచిది. గ్రహణసమయానికి ఆహారం అరిగిపోవాలి.

ఇంట్లో ఉన్న పచ్చళ్ళ మీద, ఇతర ఆహార పదార్ధాల మీద దర్భలు వేయండి. అన్నం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger