Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 5 November 2014

మనసు - శ్వాస ... మరో 6 వెన్నెల వెలుగులు

మనసు - శ్వాస ... మరో 6 వెన్నెల వెలుగులు


మనసు - శ్వాస

Posted: 05 Nov 2014 06:52 AM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మనసు చంచలమైనది.  ఈ  సృష్టి లో అన్నింటికన్నా వేగముగా పరిగెత్తేది  ఏది  అన్న యక్ష  ప్రశ్నకు  ధర్మరాజు  మనసు అని చెప్పిన సమాధానము మన అందరికి తెలిసినదే.   మనము పూజా కార్యక్రమము లో గాని,  ధ్యాన సమయము లో గాని,  ఇంకా  పలు  సంధర్భముల లో గాని కూర్చున్నప్పటికీ  మన  మనసు  ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుదన్న విషయము,   మనకి తెలిసి యున్న విషయమే.   ఆ  సంధర్భముల లో ఈ మనసు  ఎందుకు అలా  తిరుగుతూ ఉంటుంది,  దానిని  ఎందుకు  కట్టడి చేసి ఉంచ  లేక పోతున్నాము  అని పలు విధములు గా ఆలోచిస్తూ  ఉంటాము.    తెలిసిన  పెద్దలు  అందరినీ  అడుగుతూ  ఉంటాము.  ఈ సమయము నకు మనము  మన   జీవిత... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమఖండ కధనం -13 ద్వితీయాశ్వాసం -6

Posted: 05 Nov 2014 04:00 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -13

ద్వితీయాశ్వాసం -6

ఆ ఇల్లాలి మాటలు చెవులకు అమృతపు సోనలైనాయి వ్యాసునికి .ఆనందం కట్టలు తెంచుకొంది .ఇన్నాళ్ళకు మ్రుస్తాన్న భోజనం చేసే అవకాశం వచ్చిందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అయినా లోపలేదో సందేహం గా ఉంది తన మనో భావాన్ని ఆమెకు ఇలా తెలియ జేశాడు –

''తల్లీ !ఇన్ని దినాలకేనియు సుధా ధారా రసస్యందియై –యుల్లంబున్ సుఖియింప జేయు పలు కేట్లో వింటి నివ్వీటిలో

బెల్లాకొన్న కతాన నేనోకడనే భిక్షానకున్ వత్తునో –యెల్లన్ శిష్యుల గొంచు వత్తునో నిజం బేర్పాటుగా జెప్పుమా ?'' అని అడిగాడు –భావం –అమ్మా !ఇన్ని రోజులకు ఈ కాశీ  పట్టణం అమృత సదృశమై,మనసుకు సంతోషం కలిగించే మాట విన... పూర్తిటపా చదవండి...

ఆదర్శవ్యక్తులు:‘ఖట్టర్ కాకా’ :తెలుగు సేత: జె.లక్ష్మిరెడ్డి

Posted: 05 Nov 2014 03:34 AM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మైథిలీ మూలం 'ఖట్టర్ కాకా' హరిమోహన్ ఝా      ఆదర్శవ్యక్తులు నా చేతిలో పుస్తకం చూసి చిన్నాన్న అడిగాడు - ఏదో లావు పుస్తకంతో బయలుదేరావే! నేనన్నాను - 'ఆదర్శ చరితావళి' చిన్నాన్న చిరునవ్వు నవ్వి అన్నాడు - ఈ రోజుల్లో ఎవరైనా ఇందులోని ఆదర్శాల ప్రకారం నడిస్తే నేరుగా పిచ్చాసుపత్రికే పోతారు! నేను - అలా ఎందుకంటారు చిన్నాన్నా? చూడండి, సత్యవాది, దానవీరుడు అయిన హరిశ్చంద్ర మహారాజు ఎలాంటివాడో! '... పూర్తిటపా చదవండి...

చంద్రుళ్ళో కుందేలు ​- 11

Posted: 05 Nov 2014 03:01 AM PST

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి

​ముందు రోజు చెప్పినట్టుగానే తెల్లారి ఉదయం ఆరున్నరకల్లా వచ్చేసాడు అశోక్. నానమ్మ ఇంటికి ప్రయాణం కట్టే ఉత్సాహంలో పూజ అంత ఉదయాన్నే పేచీల్లేకుండా ​​నిద్రలేచింది.​

ఏడింటికల్లా విజిత, పూజలని తీసుకుని శరత్ ఊరికి బయలుదేరాడు. నీలూ, మేఘ దగ్గరుండి అందర్నీ సాగనంపారు.

​పూర్తిగా ఇక్కడ కౌముది... పూర్తిటపా చదవండి...

నీడలు

Posted: 05 Nov 2014 01:36 AM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
చీకటి ఒక దీపంలా వెలుగుతున్న క్షణాన
ఒక్కడివే నువ్వు-

రాత్రిలో తడిచి ముద్దయిన గోడలు.
లోపలేవో ఊగిసలాడుతున్నట్టు
అటూ ఇటూ ఊగే లతలు. వొణికే నీడలు.

ఏ దారీ చేరని, నిను వీడని ఊడలు. చేతులైనా కాని
ఒక ముఖమైనా కాని, ఒక పలుకైనా
కాని, నిన్ను వణికించే నీడలు.

రాతి రెక్కల కింద, వెచ్చగా పొదగనివ్వని
పడుకోనివ్వని, తల్లి లేని నీడలు
నిన్ను తండ్లాటకు గురి చేసి
నిన్ను ఆనాధను చేసే నీడలు

'నువ్వు' అనే చీకటి దీపం చుట్టూ
వలయాలుగా పరచుకునే నీడలు
వాన సవ్వడి చేసే, కన్నీళ్ళ వాసన వేసే నీడలు
నల్లని, తెల్లని లేతేరుపు న... పూర్తిటపా చదవండి...

గురు సంకల్పం

Posted: 05 Nov 2014 01:28 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
... పూర్తిటపా చదవండి...

"రుధిర సౌధం " పూర్తి చేశాను

Posted: 05 Nov 2014 12:11 AM PST

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
డియర్ రీడర్స్ ..

             
              మీ అందరి అభిమానం తో విజయవంతం గా బ్లాగ్ లో "రుధిర సౌధం " పూర్తి చేశాను . ఈ రోజు తో

మీ అభిమాన పాత్రలు మీ మనసు లో చెరగని ముద్ర వేసి వీడుకోలు చెప్ప బోతున్నాయి .. మీ అభిమానం తో

పాటుగా మీ అభిప్రాయాలను పంచారు .. సలహాలను ఇచ్చారు . చాలా చాలా కృతజ్ఞతలు మీ అందరికీ .

మీ అందరికీ నచ్చే మరో నవల తో మళ్ళి మీ మనసుల్ని చూరగొనాలని ఆశిస్తాను . మీ అమూల్య మైన

సలహాలకి , అభిప్రాయాలకి " నా రచన " ఎప్పుడు స్వాగతం చెబుతుంది .

ధన్యవాదాలు ..
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger