Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 30 December 2014

కొత్త మూలకాల గుంపులు ... మరో 5 వెన్నెల వెలుగులు

కొత్త మూలకాల గుంపులు ... మరో 5 వెన్నెల వెలుగులు


కొత్త మూలకాల గుంపులు

Posted: 30 Dec 2014 08:04 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
మెండెలేవ్ రూపొందించిన వ్యవస్థ కొత్త మూలకాల ప్రవేశానికి వీలు కల్పించాల్సి వుంది. కొత్త మూలకాలు కూడా ఆవర్తన పట్టికలో తీరుగా ఒదిగిపోగలిగి నప్పుడే ఆ పట్టికకి పూర్తి ఆమోదం దొరుకుతుంది.

1794  లో యోహాన్ గాడొలిన్ (1760-1852) అనే ఫిన్నిష్ రసాయన శాస్త్రవేత్త ఓ ఖనిజంలో కొత్త లోహపు ఆక్సయిడ్ కనుక్కున్నాడు. ఆ ఖనిజపు శకలం అతడికి స్వీడెన్ లోని స్టాక్‍హోమ్ నగరం వద్ద యిటర్బీ అనే  రాతిగని (quarry) లో  దొరికింది. సిలికా, సున్నం,... పూర్తిటపా చదవండి...

దర్శ నీయ ఆంజనేయ దేవాలయాలు 59-శ్వేత వర్ణ ఆంజనేయ స్వామి –ఎల్లా రెడ్డి గూడా

Posted: 30 Dec 2014 06:32 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

         

 దర్శ నీయ ఆంజనేయ దేవాలయాలు

 59-శ్వేత వర్ణ ఆంజనేయ స్వామి ఎల్లా రెడ్డి గూడా

 హైదరాబాద్ జిల్లా సికిందరా బాద్ కు నాలుగు కిలో మీటర్ల దూరం లో ఉన్న ఎల్లా రెడ్డి గూడాలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .స్వామి శ్వేత వర్ణం తో మహా మహిమాన్వితుడుగా దర్శన మిస్తారు .అమిత తేజోమయం గా భాసిస్తారు .ఈస్వామిని పూజిస్తే సకల దేవతారాధనచేసినంత ఫలితం  లభిస్తుందని విశ్వాస... పూర్తిటపా చదవండి...

సొమ్మలు పోనాయండి

Posted: 30 Dec 2014 05:06 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
అప్పు.. కేవలం మూడొందల రూపాయల అప్పు.. దాసరి సన్యాసి కొడుకు దాసరి బోడియ్య జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఆ అప్పు కారణంగానే బోడియ్య సొమ్మలు పోనాయి, బూదేవత పోనాది, సంసారమంతా సల్లారిపోనాది. బోడియ్య చదువుకున్న వాడు కాదు. సొమ్ములున్నవాడు కాదు. బలం, బలగం ఉన్నవాడు అంతకన్నా కాదు. పైపెచ్చు, ఏనాడూ తగువులంటూ పోలీసు స్టేషన్లంట, కోర్టుల వెంట తిగిరినవాడూ కాదు. తనపనేదో తను చేసుకుపోయే బోడియ్య అప్పు పుచ్చుకున్నది మామూలు వాడి దగ్గర కాదు, వాళ్ళూరి ప్రెసిడెంటు దగ్గర. అందుకే, అప్పు కారణంగా అతగాడి సొమ్మలు పోనాయి.. వాటితో పాటే అన్నీ పోనాయి.

<... పూర్తిటపా చదవండి...

“నాంచారమ్మ కథ” డా. జి వి పూర్ణచందు

Posted: 30 Dec 2014 05:00 AM PST

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

"నాంచారమ్మ కథ"

డా. జి వి పూర్ణచందు పూర్తిటపా చదవండి...

మనుషులూ – గౌరవాలు

Posted: 30 Dec 2014 01:29 AM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

ఆ మనిషంటే చాలా గౌరవం.. ఆ మనిషి అలా ప్రవర్తిస్తాడని నేనూహించలేదు.. ఏళ్ల తరబడి ఉన్న ఓపీనియన్ మొత్తం కొట్టుకుపోయింది.. "మనుషులు ఇలా కూడా ఉంటారా?".. ఆ చులకన నవ్వు తలుచుకుంటే మనిషి మొహం మళ్లీ చూడాలన్పించట్లేదు..

"ఇన్నాళ్లూ ఎంత నటించాడూ.. చాలా ఆప్తుడైనట్లు చాలా ప్రేమగా మాట్లాడే మాటల్తో? లోపలున్న ఎమోషన్లని దాచుకుంటూ పైకి ఫేస్ చాలా ప్రేమగా పెడుతుండే వాడన్నమాట.. ఓ చిన్న నవ్వుతో, ఫేస్ ఎక్స్‌ప్రెషన్ తో మొత్తం బయటపడిపోయింది.. "

ఇలా నాలో నేను చాలా అనుకుంటూనే ఉన్నాను..

అంతే.. ఉన్న ఫళంగా ఓ మనిషిపై నా ప్రేమా, గౌరవం మొత్తం ఆవిరైపోయాయి.. లైఫ్ లాంగ్ ఆ మనిషి నా దృష్టిలో అతి సామాన్యుడే..
... పూర్తిటపా చదవండి...

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వ్యాఖ్యానము " అమ్మ "

Posted: 30 Dec 2014 01:16 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు గారి వ్యాఖ్యానము " అమ్మ " ను గురించి ...... ... పూర్తిటపా చదవండి...

1 comment :

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger