Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 30 January 2015

బాట వీడి నడచు వాడె జ్ఞాని ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

బాట వీడి నడచు వాడె జ్ఞాని ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


బాట వీడి నడచు వాడె జ్ఞాని

Posted: 29 Jan 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - బాట వీడి నడచు వాడె జ్ఞాని 



ఆటవెలది:
అనృతము గల బాట, నావేశముల బాట
హితము గాని బాట, హింస బాట
పరులు దిట్టు బాట,పరమార్థములు లేని
బాట వీడి నడచు వాడె జ్ఞాని

... పూర్తిటపా చదవండి...

బతుకు ప్రమాణాలు

Posted: 29 Jan 2015 03:17 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
కిందివాటాలో తుంగచాపచుట్టా, తాతసైకిలూ (కొండ చీపురు కనిపించదేం చెప్మా!) పైవాటాలో సెటిలైటు చిప్పా, బీబీక్యూ పొయ్యీ (వారిగాజుతలుపుమీద రవిచంద్రుల ప్రతిబింబాలు కప్పేస్తూ) మునిమాపువేళ వంటింట నడయాడే తోలుబొమ్మలు మూకీచిత్రం గుర్తు చేస్తూ బతుకు ప్రమాణాలకి భాష్యం చెప్తున్నట్టుంది! (జనవరి 29, 2015)Filed under: కవితలు... పూర్తిటపా చదవండి...

దత్తపది - 66 (కల్లు-నీరా-సారా-సుర)

Posted: 29 Jan 2015 12:18 PM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
కల్లు - నీరా - సారా - సుర
పైపదాలను ఉపయోగిస్తూ
మద్యపాన నిషేధం గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

ఎనిమిది సంవత్సరాలక్రితం ఇదేరోజు "హరిహర సమేతంగా అమ్మ" తన పరివారం తో కదలివచ్చి ఇక్కడ కొలువైన రోజు.

Posted: 29 Jan 2015 11:32 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
రెండువేల ఏడు లో జనవరి ఇరవైఎనిమిది   మన కాలెండర్ ప్రకారం  మాఘశుధ్ధ దశమి రోజు పీఠం లో  మూర్తిరూపంగా అమ్మ పరివారదేవతలతో కొలువైకూర్చున్నది.  మాతాతగారు,నాయనమ్మ లపై అపారమైన దయతో అమ్మ తననుపూజించే అదృష్టం కలుగజేసింది . ఆ తరువాత  ఏపూర్వజన్మ అదృష్టమో  ఆతల్లి సేవాభాగ్యం ప్రసాదించి మందిరనిర్మాణం జరిపించి ,ఆపై చిత్రమైన లీలలతో  ప్రతిష్ఠా కలాపం జరిపించి  అమ్మ కరుణ ఎలాఉంటుందో నాజీవితంలో ప్రత్యక్షంగా   చూపించినది. ఆలీలలన్నీ గతం లోవ్రాసిన పోస్ట్ లలో చూడండి
http://durgeswara.blogspot.in/2011... పూర్తిటపా చదవండి...

జీవితంలో చెడు చాలా చూశాను … యూజెన్యో మోంటేల్, ఇటాలియను కవి

Posted: 29 Jan 2015 11:26 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

జీవితంలో చెడు చాలా చూశాను;

ఎండిందనుకున్న దొంగయేరు అదాత్తున పొంగినట్టు,

ఎండకి మాడిపోయిన ఆకులు ముడుచుకుపోయినట్టు,

పరిగెడుతున్న గుఱ్ఱం దబ్బున కూలబడినట్టు.

మంచి అంతగా ఎరుగను; దైవం ఎందుకు

నిర్లిప్తంగా ఊరుకుందా అన్న ఆశ్చర్యం తప్ప;

అది పగలే నిద్రలో మునిగిన శిలావిగ్రహం లాటిది

ఎక్కడో గగనతలంలో ఎగురుతున్న డేగలాంటిది.

.

యూజెన్యో మోంటేల్

(12 October 1896 – 12 September 1981)

ఇటాలియను కవి

 .

పూర్తిటపా చదవండి...

ఒక గుర్నాథం కథ ముగింపు

Posted: 29 Jan 2015 10:28 AM PST

రచన : noreply@blogger.com (Chandu S) | బ్లాగు : చందు.S రచనలు
Continued from 
ఒక గుర్నాథం కథ


  వయసులో ఉన్నపుడున్న  ఆలో... పూర్తిటపా చదవండి...

నిజమైన రుద్రాక్షలు గుర్తించడం ఎలా ?

Posted: 29 Jan 2015 10:15 AM PST

రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “పద్మ” ఎవార్డులు ఓ “వేళాకోళం” అయిపోయాయి….

Posted: 29 Jan 2015 08:31 AM PST

రచన : భమిడిపాటి ఫణిబాబు | బ్లాగు : PHANI BABU -musings

    ఒకానొకప్పుడు గణతంత్ర దినోత్సవానికి ముందురోజు, కేంద్రప్రభుత్వం, దేశంలోని వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకి , పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ఎవార్డులు ప్రకటించేవారు. సాధారణంగా, మర్నాటి వార్తాపత్రికల్లోనే చదివి తెలిసికునేవాళ్ళం. పేపరులో చదవగానే, " ఓహో.. ఫలానావారికిచ్చేరన్నమాట.." అనుకునేవారం. " భారతరత్న" అయితే, ప్రతీ ఏడాదీ కాకుండా, సంఘంలో ఎంతో ఘనత సాధించినవారికి, ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకీ ప్రకటించేవారు. భారతరత్న బిరుదు కూడా, కనిపించిన ప్రతీవాడికీ ఇచ్చుకుంటూ పోలేదు. భారతరత్న బిరుదాంకితుల లిస్టు చూస్తేనే తెలుస్తుంది. కానీ, కొంతకాలానికి, రాజకీయ కారణాలతో ఇచ్చేవారు. అప్పటినుండీ మొదలయింది,... పూర్తిటపా చదవండి...

విశాఖను ఊరిస్తున్న ప్రాజెక్టులు

Posted: 29 Jan 2015 08:31 AM PST

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. అండర్ గ్రౌండ్ ఎలెక్ట్రిసిటీ, మెట్రో రైల్స్, స్మార్ట్ కాలనీలు ఇలా ఒక్కో ప్రాజెక్ట్ తో విశాఖను సూపర్ సిటీగా మార్చబోతున్నారు. మత్స్యకార నగరం నుంచి మహా నగరంగా విశాఖ రూపురేఖలు సూపర్ ఫాస్ట్ గా మారనున్నాయి.

Related Videos

'బ్లాగిల్లు' వేగం కాస్త పెరిగింది

Posted: 29 Jan 2015 08:30 AM PST

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
       మొబైల్ వినియోగదారులకు బ్లాగిల్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఉన్నమాట మీకు తెలుసుకదా ? అప్లికేషన్ ద్వారా కాకుండా నేరుగా ఆ వెబ్ సైట్ క్రింది లింక్ ద్వారా దర్శించవచ్చు.                                              m.blogillu.com        వివిధ పరీక్షల తర్వాత ఇదే తరహా రంగులను ( బ్లాగు పేరు : శీర్షిక ) మెయిన్ వెబ్ సైట్ లో కూడా వినియోగించదలిచాను .       ఈ సైట్ లో తాజా టపాలు ప్రస్తుతం ఉన్న సైట్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger