Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 4 February 2015

తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.

Posted: 03 Feb 2015 03:31 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేలును ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.


ఉత్పలమాల:
మేలుగ పెండ్లియాడి మది మెచ్చిన రీతిగ ప్రేమయాత్రకై
చాలప్రదేశముల్ తిరిగి చక్కని తోటను సేద తీరగా
కేలును జాపగా పతియు కిమ్మనకుండను చేరి కౌగిటన్
తేలును, ముద్దులాడి చెలి తియ్యగ నవ్వును పండువెన్నెలన్.
... పూర్తిటపా చదవండి...

వార్ధక్యం రావడం అంటే… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి

Posted: 03 Feb 2015 01:32 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

"వార్ధక్యం రావడం" అంటే ఏమిటి?
ఆకారంలోని శోభనీ,
కళ్ళలోని మెరుగునీ కోల్పోవడమా?
అందం దాని అలంకారాలని కోల్పోడమా?
అవును, కానీ అవొక్కటే కాదు.

మన వికసనము కోల్పోవడమే కాదు,
మన శక్తి … మన సత్త్వము క్షీణించినట్టు అనిపించడమా?
లేక, మన శరీరంలోని ప్రతి అంగమూ
బిరుసెక్కినట్టనిపించి, ప్రతి చర్యలోనూ నైపుణ్యం తగ్గి,
ప్రతి నరం నీరసంగా కొట్టుకోవడమా?

<... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 811

Posted: 03 Feb 2015 11:11 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

ఈ రోజు ప్రాధాన్యం మీకు తెలుసు క‌దా..!

Posted: 03 Feb 2015 09:55 AM PST

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,
ఏ అంశం మీద‌నైనా అవ‌గాహ‌న పెంచుకోవ‌టం చాలా అవ‌స‌రం. ఆరోగ్య విష‌యాల్లో ఇది చాలా వాస్త‌వం. అందుకే అవ‌గాహ‌న కోసం ఇటువంటి ఆర్టిక‌ల్స్ ఎక్కువ‌గా రాయ‌టం జ‌రుగుతోంది.
ఫిబ్ర‌వ‌రి 4 న ప్ర‌పంచ క్యాన్స‌ర్ అవ‌గాహ‌న రోజుగా పాటిస్తున్నాం. ఆక‌స్మిక మ‌ర‌ణాల‌కు దారి తీస్తున్న క్యాన్స‌ర్ నుంచి మాన‌వాళిని సంర‌క్షించేందుకు, క్యాన్స‌ర్ ముప్పును సాధ్య‌మైనంత త‌గ్గించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా దీన్ని పాటించ‌టం జ‌రుగుతోంది. దీన్ని మొద‌ట‌గా యూనియ‌న్ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్యాన్స‌ర్ కంట్రోల్ సంస్థ దీనికి నాంది ప‌లికింది. 2008 లో దీనికి పూర్తి స్థాయిలో సాధికార‌త ఏర్... పూర్తిటపా చదవండి...

కొత్తది వుంది పాతది తియలేదు

Posted: 03 Feb 2015 08:53 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
ఇది విజయవాడ లో అమ్మ ఆసుపత్రి దగ్గర కొత్త స్తంభం నాటారు పాతది తియ్య లేదు పాత దాని మీదే విధ్యుత్తు తీగలు. జనాల్ని కాపాడండి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger