Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 19 February 2015

భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.

Posted: 18 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె. 


తేటగీతి:
భీష్మ పాత్రకు పెట్టింది పేరతనిది
అంబ వేషములో నామె యారితేరె
కలసినాటక మాడుచు కలియ మనసు
భీష్ముఁ డంబను బెండ్లాడి బిడ్డలఁ గనె.
... పూర్తిటపా చదవండి...

కిష్కింధకాండ

Posted: 18 Feb 2015 11:04 AM PST

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

సంస్కృతములో " కిష్కి" అంటే శరణాగతి, లేదా పరమాత్మ పాదములు అని అర్ధము. అలా శరణాగతి చేసినవానిని కిష్కింధ: అంటారు. భగవంతుని శరణాగతి చేసినవారికి ఎల్లప్పుడూ ఆనందము కలుగుతుంది అని కిష్కింధకాండ అర్ధము.


Filed under: Uncategorized పూర్తిటపా చదవండి...

దత్తపది - 68 (మబ్బు-వాన-నది-వరద)

Posted: 18 Feb 2015 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
మబ్బు - వాన - నది - వరద
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

చిటారు కొమ్మన కులికే చిలకా!

Posted: 18 Feb 2015 09:36 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చిలకా! చిలకా! చిటారు కొమ్మన కులికే చిలకా! 
ఇంత సుందరముగ ; ఎపుడయ్యావు నీవు? || 

శ్రీరాములు సాగరమున; కట్టేరు వారధి ; 
"ధిమి ధిమి ధిమి,  తద్ధిమి" అని - 
         - ఆడుతూ పాడుతూ ; 
గండశిలలు, బండరాళ్ళు; పేర్చుతూ, 
ఇంచక్కా; కట్టారు వానరులు
        - అంత పెద్ద వంతెనని;   ||

బుల్లి ఉడుత ఇసుక జల్లి, పాటుపడెను స్వామికై; 
మునుపు శబరి ఇచ్చెనుగా; రాములకు రేగి పళ్ళు; 
అట్లె నేను జామ పళ్ళు ఇస్తి హనుమ, రాములకు, అందరికీ!   పూర్తిటపా చదవండి...

భాష

Posted: 18 Feb 2015 09:12 AM PST

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం
ఒక ప్రవాహం.  స్వచ్చ మైన చినుకులతో మొదలై, అనేక కాలువలను  కలుపుకొని సాగుతుంది.  నిరంతరం పారే ప్రవాహం  నడక  ఒక్కోచోట మైదానంలో సాగవచ్చు. ఒక్కోచోట కొండల మీదనుండి క... పూర్తిటపా చదవండి...

శ్రీపాద వారి - పుల్లంపేట జరీ చీర

Posted: 18 Feb 2015 09:08 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఆంధ్రభూమి 1940 నాటి సంచికలో వచ్చిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి చిన్నకధ "పుల్లంపేట జరీ చీర" చదువుదాము. అయితే ఇలా పాత సంచికలలో వచ్చిన వారి కధలు చాలా మటుకు సేకరించి విశాలాంధ్ర వారు "పుల్లంపేట జరీ చీర" అన్న పుస్తకం పేర ప్రచురించారు. మరి ఈసారి పండుగకు ఈ "పుల్లంపేట జరీ చీర" కొని చూడండి మీకే తెలుస్తుంది. 

పూర్తిటపా చదవండి...

ఇందుకు విరహితము

Posted: 18 Feb 2015 08:37 AM PST

రచన : Sujata | బ్లాగు : శ్రీనివాసం
ఇందుకు విరహితము లిన్నియు నజ్ఞానమని చందమున గీతలందు జాటీ నిదివో మానావమానములు మానిడంబు విడుచుట పూని హింసకు జొరక యరుపు గలుగుటయు అని మతి గరగుట యాచార్యోపాసన తానెప్పుడు శుచియౌట తప్పని విజ్ఞానము అంచల సుస్థిర బుద్ధి యాత్మ వినిగ్రహము అంచిత విషయ నిరహంకారాలు ముంచిన జన్మ దుఃఖములు దలపోయుట కంచపు సంసారము గడచుటే జ్ఞానము అరి మిత్ర సమబుద్ధి అనన్య భక్తియు సరి నేకాంతమును సజ్జన సంగవిముక్తి ధర నధ్యాత్మ... పూర్తిటపా చదవండి...

రుద్రాక్ష జాబాల ఉపనిషద్ (1)

Posted: 18 Feb 2015 08:26 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
రుద్రాక్ష జాబాల ఉపనిషద్ (1)
హరి  ఓం!   రుద్రాక్ష జాబాలి ఉపనిషద్ ద్వారా, మహారుద్రునికి చెందిన రుద్రాక్షలను గురించి తెలుసుకుందాం.

భూశండుడు కాలాగ్ని రుద్రుని ఇలా అడిగాడు..రుద్రాక్ష ల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? వాటిని ధరించడం వలన ఒనగూరే ప్రయోజనం ఏమిటి? అని..

కాలాగ్ని రుద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. త్రిపురాసురులను సంహరించే నిమిత్తం ఒకసారి నేను నా కన్నులను మూసుకున్నాను. అట్లు మూసిన నా కన్నుల నుండి అశ్రువులు స్రవించి భూమిపై పడినవి.  ఆ బిందువులు రుద్రాక్షలుగా మారినవి. రుద్రుని అక్షుల (కన్నుల ) నుండి వెలువడినవి కావున రుద్రాక్షలు అని... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger