Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 8 April 2015

తెర ... మరో 2 వెన్నెల వెలుగులు

తెర ... మరో 2 వెన్నెల వెలుగులు


తెర

Posted: 08 Apr 2015 06:18 AM PDT

రచన : skv ramesh | బ్లాగు : skvramesh

                          తెర 

నేటి బాలల కోసం నువ్వు లేవనుకున్నాను గాని 
బడి గోడలూ, దాటేశావని తెలుసుకోలేక పోయాను. 
సమ్మోహనాస్త్రాలు మెండుగా ఉన్న 
ఉద్వేగోన్మాదివి నువ్వు. 
ప్రేమలను విరబూయిస్తావు,
పగలే పరమార్ధమంటావ... పూర్తిటపా చదవండి...

వర్ణచిత్రం -2

Posted: 08 Apr 2015 05:03 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
(మొదటిభాగం తర్వాత)

ఒడిదుడుకులు నా జీవితంలో ఓ భాగం అయిపోయినా, ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. అంతేకాదు, వాటినుంచి బయటపడే శక్తి చిన్నా నుంచే దొరుకుతూ ఉంటుంది నాకు. విమానం సాఫీగా సాగుతోంది. కుదుపు తగ్గడంతో మళ్ళీ నిద్రలోకి వెళ్ళాడు చిన్నా. నేను వెళ్ళడానికి నా గతం ఉండనే ఉంది కదా..

అమ్మ నన్ను పురిటికి తీసుకెళ్ళడానికి వచ్చిన రోజునే శ్రీకాంత్ గారు ఇంటికి వచ్చారు. నేను ఏమీ అడిగింది లేదు. జరిగింది ఇదీ అని అమ్మకి చెప్పనూలేదు. గంగ గురించి నాకు తెలియకప... పూర్తిటపా చదవండి...

స్మృతి

Posted: 08 Apr 2015 04:58 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నీ నుదుటిన
ఒక వాన చినుకు. చిగురాకంత గాలి అప్పుడు నీలో: గూళ్ళల్లో సర్దుకుని
బెదురుగా  ఎదురుచూసే పిచ్చుకలు నీ కళ్ళు. కంపించే
ఒక సాయంత్రం, మబ్బులు గుమికూడిన ఆకాశం
 
మసక చీకటీ, ఎవరిదో ఒక అశ్రువు చితికిన కాటుకై -

ఎవరిదో మరి అప్పుడు
నిను తాకే - పురాజన్మల సువాసన. ఎవరివో  మరి అప్పుడు, నిన్ను రహస్యంగా హత్తుకునే
బాహువులు. ఎవరివో మరి అప్పుడు, చిన్నటి మాటలు: ఎవరివో మరి అప్పుడు
నిన్ను స్మరించే పెదాలు -

మరి ఎవరిదో
ఒక ముఖం

అప్పుడే, వెనుక నుంచి నిన్ను అతి మృదువుగా ప... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger