Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 11 June 2015

మతం, హింస, నాగరికత భవిష్యత్తు--క్రైస్తవం ఇంత అమానుషమా? ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మతం, హింస, నాగరికత భవిష్యత్తు--క్రైస్తవం ఇంత అమానుషమా? ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మతం, హింస, నాగరికత భవిష్యత్తు--క్రైస్తవం ఇంత అమానుషమా?

Posted: 10 Jun 2015 02:34 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
11వ భాగం మతం, హింస, నాగరికత భవిష్యత్తు సృష్టికర్త మీరు నమ్మిన పవిత్రగ్రంథాన్ని రాసినట్లు ఎందరో విశ్వసిస్తున్నారు. ఎన్నో పుస్తకాలు దైవం పేరిట వచ్చినట్లు చూపారు. మనం ఎలా బతకాలో ఆ పుస్తకాలు చెబుతున్నాయి. పోటీపడుతున్న మత సిద్ధాంతాలు మన ప్రపంచాన్ని విడదీసి వివిధ నైతిక సమాజాల పేరిట సంఘర్షణలకు దారి తీశాయి. ఇందుకు బదులుగా కొంతమంది ఇంగిత జ్ఞానం కలవారు మత సహనం కావాలన్నారు. మత యుద్ధాలకంటే మత సహనం... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 929

Posted: 10 Jun 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
1908149_1003492363036634_592557427110055
పూర్తిటపా చదవండి...

భూచక్రం

Posted: 10 Jun 2015 09:37 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
గడిచిన రెండు దశాబ్దాలలో శరవేగంగా విస్తరించిన కొన్ని వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ ఒకటి. వ్యవసాయ భూములని వ్యవసాయేతర ప్రయోజనాలకోసం, మరీ ముఖ్యంగా గృహ నిర్మాణాల కోసం వినియోగించడం అన్నది ఒకప్పుడు ఏమాత్రం ఊహించని పరిణామం. నూతన ఆర్ధిక విధానాల కారణంగా కొత్తకొత్త ఉద్యోగాల రూపంలో ఆదాయం పెరిగినట్టుగానే, కొత్తకొత్త ఖర్చు మార్గాలూ పుట్టుకొచ్చాయి. భూమి విలువని అకస్మాత్తుగా పెంచి, డిమాండ్ సృష్టించిన ఈ వ్యాపారం సరికొత్త సామాజిక వర్గాలనీ సృష్టించింది.

రియల్ ఎస్టేట్ రంగాన్ని ఇతివృత్తంగా చేసుకుని తెలుగు సాహిత్యంలో ఎన్నో కథలు వచ్చాయి... పూర్తిటపా చదవండి...

కందుకూరి శివానందమూర్తి గారు

Posted: 10 Jun 2015 09:37 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
నిన్న అర్ధరాత్రి  1-55 గంటలకు శివైక్యం చెందారు సద్గురువులు , శైవమహాపీఠం అధిపతి, శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. వీరు తెలుగు వారు, రాజమండ్రిలో జన్మించారు. ఆధునికకాలంలో భారతదేశం చూసిన ఆధ్యాత్మిక గురువులలో శ్రేష్టులు గురువుగారు. పురాణకాలంలోని దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, వేదవ్యాసుడు, మైత్రేయి, కృష్ణభగవానుడు మొదలు ఆదిశంకరులు, భగవాన్ రమణమహర్షి వంటి గురువుల సంప్రదాయానికి చెందినవ్యక్తి గురువుగారు. భారతదేశానికి ఋషులే సంపద, చరిత్ర, జీవం, శక్తి, అన్నీ. అటువంటి ఋషుల గురించి వివిధ పురాణాల్లో ఉన్న అనేక విషయాలను సేకరించి 'మహర్షుల చరిత్రలు' అనే పేరుతో రెండు సంపుటాలుగ... పూర్తిటపా చదవండి...

చెప్పుకొనేందుకేమున్నది

Posted: 10 Jun 2015 09:27 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ఎవరువీళ్ళు? మారాజుల్లా కనకపు సింహాసనాన్ని కరచిపట్టుకుంటారు.రేరాజుల్లా పేర్లని పిలిచిపెట్టుకున్నారు. ఏంటి వీళ్ళుఇంకా చిగురించని రేపటికలల్నిఇంతముందస్తుగానే దొంగిలిస్తున్నారు. ఎవరెహే ఈల్లు?బుద్దితక్కువ చీకట్లలో దిక్కుతోచకదేశపు ఈగో దేహాలను వెలిగించాలను చూస్తున్నారు. చెప్పు చెప్పూ అంటే ఏముంటుంది.నడిచేందుకే కాదు నడతమార్చేందుకూసిద్దంగానే వుంటుంది.కుక్కకాట్లకు మందుమాటగా కూడా.కాలిక్రిందదేలే అని ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger