Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 11 June 2015

రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


రైతుని గమనించండి… అలెగ్జాండర్ పుష్కిన్, రష్యను కవి

Posted: 11 Jun 2015 12:44 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇసక పర్రలలో స్వేచ్ఛాబీజాలు జల్లుతుంటే

చుక్క పొడవకముందే నేను నడుస్తున్నాను;

పాపం బానిస నాగళ్ళు విడిచిన చాళ్లలోకి

స్వచ్చమైన, నిష్కల్మషమైన వేళ్ళు విత్తులు జల్లుతున్నాయి

ఫలప్రదమైనది ఈ విత్తనము, తరాలను సృష్టిస్తుంది;

కానీ, ఈ పంట నొర్లుకునేవాడు, వట్టి అహంకారపు జులాయి

ఇప్పుడు నాకు అర్థం అయింది 'వృధాశ్రమ' అంటే ఏమిటో.

ఓ శాంతియుత దేశాల్లారా, మీకు కావలసినంత మెయ్యండి

మీ రెన్నడూ అన్నార్తుల ఆక్రందనలకి బదులు పలకలేదు !

స్వాతంత్ర పోరాటాల పిలుపులకి గొర్రెలా బదులు పలికేది?

ఉన్ని కత్తిరించడానికో, బలిగా ఇవ్వడానిక... పూర్తిటపా చదవండి...

105వ సుందరకాండ ప్రారంభ దృశ్యమాలిక

Posted: 10 Jun 2015 11:45 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

నా విశేష రచన (ముచ్చటలు)

Posted: 10 Jun 2015 10:58 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
స్నేహాంజలి.
నా 
విశేష రచన

దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.

Posted: 10 Jun 2015 08:16 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దీపము నార్పఁగ గృహమునఁ దేజ మ్మెసఁగెన్.


కందము:
దీపము బెట్టుచు నిత్యం
బాపరమేశుని వదలక నర్చన లిడుచున్
ధూపముతో చెడుశక్తుల
దీపము నార్పఁగ, గృహమునఁ దేజ మ్మెసఁగెన్.


కందము:
ఈ పడతి బొమ్మ చీకటి
లోపల తా వెల్గు, జూడ  లోనికి రమ్మా... పూర్తిటపా చదవండి...

మహా సర్వతోభద్ర విద్యున్మాలా వృత్తము. రచన శ్రీవల్లభ.

Posted: 10 Jun 2015 08:11 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తి కవి కృతమైన అత్యంత క్లిష్టతరమైన మహా సర్వతోభద్ర విద్యున్మాలా వృత్తమును తిలకించండి.

                                                  జీవన పరమార్ధం దండకారణ్య ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది...

Posted: 10 Jun 2015 08:11 PM PDT

రచన : జలసూత్రం చంద్రశేఖర్ | బ్లాగు : టూకీగా
                                                  జీవన పరమార్ధం 

guru.jpg

దండకారణ్య ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంది . మౌనీష మహర్షి ఆశ్రమానికి ఆనుకొని ప్రవహిస్తున్న సెలయేరు ఆశ్రమం దగ్గరకు వచ్చేసరికి నిశ్శబ్దంగా పారుతోం... పూర్తిటపా చదవండి...

మతమే మానవజీవితమ్ము చివురింపంగా వసంతమ్ము

Posted: 10 Jun 2015 07:37 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
scan0014a.jpg

... పూర్తిటపా చదవండి...

దత్త

Posted: 10 Jun 2015 06:48 PM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క

datta.jpg
(శ్రీ సాధనపత్రిక 08-09-1928 సంచిక నుండి)

... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - ఎట్టివారికైన

Posted: 10 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-408-narada.jpg
7-10-ఆటవెలది

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger