Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 18 June 2015

త్రైలింగ స్వామి సూక్తి ... మరో 6 వెన్నెల వెలుగులు

త్రైలింగ స్వామి సూక్తి ... మరో 6 వెన్నెల వెలుగులు


త్రైలింగ స్వామి సూక్తి

Posted: 18 Jun 2015 09:20 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
tralinga%2Bswami%2B2.JPG

... పూర్తిటపా చదవండి...

మరల వైదిక ధర్మపు వైభవమును చూడగలమా?

Posted: 18 Jun 2015 09:05 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
* నేటి వివాహ వ్యవస్థ మన సంప్రదాయాలను పూర్తిగా విస్మరించింది. పురోహితులుగూడా తూతూ మంత్రం గా ముగిస్తున్నారు. వైదిక ధర్మం కనుమరుగవుతోంది. మరల వైదిక ధర్మపు వైభవమును చూడగలమా?
-వి.బాలకేశవులు, గిద్దలూరు
ఈమధ్యనే ఒక విదేశీయుడు చెప్పినట్లుగా ఒక దేశంలో అత్యధిక సంఖ్యాకులు అనసరించే ధర్మాన్ని అదే ధర్మానుయాలు విమర్శించటమనేది ప్రపంచంలో ఒక భరతదేశంలో మాత్రమే వుంటోంది. ఈ దుస్థితి తొలగితే వైదిక ధర్మం పునర్వైభవాన్ని అందుకుంటుంది. అది జరగాలంటే, పిల్లలకు మన వైదిక ధర్మాన్ని గురించి చిన్నప్పటినుంచే మనం బోధించగలగాలి. ఇతర మతాల వ్యవహారాలలో వేలుపెట్టడానికి దమ్ములేని... పూర్తిటపా చదవండి...

తెర వెనుక -2

Posted: 18 Jun 2015 07:42 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
(మొదటిభాగం తర్వాత...)

"లంక తగిలేసింది బాబుగోరూ.. మరేటీ బయ్యం లేదు," వీర్రాజు కేక వినిపించింది. కళ్ళు చీకటికి అలవాటు పడుతూ ఉండగానే మబ్బులు తొలగిపోయి వెన్నెల కురిసింది. పడవ నీళ్ళదారి పట్టింది నెమ్మదిగా.

స్వామి చేతిలో గ్లాసు పరుపు మీద పడి, కొంత స్కాచ్ ఒలికింది. కాసేపటి తర్వాత, నా సిగరెట్ అయిపోవడం చూసి, తనో పెగ్గు కలుపుకుని, నాకూ ఓ స్మాల్ పెగ్ అందించాడు. చల్లని వాతావరణంలో, చలచల్లని డ్రింక్ గొంతు దిగడం, ఆ వెనుకే లోపలినుంచి వేడి పుట్టడం ఓ... పూర్తిటపా చదవండి...

వినాయక విగ్రహాల మెటీరియల్ రకాలు మరియు వాటిని ఉంచటానికి దిశలు

Posted: 18 Jun 2015 07:33 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
1.
గిఫ్ట్ వినాయకుడు విగ్రహాలు వాస్తు ప్రకారం,వివిధ రకాల పదార్థాలతో తయారుచేసిన
వినాయక విగ్రహాలను వేరు వేరుగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే,మీరు వినాయక విగ్రహాలను
ఏ దిశలో పెట్టారనేది కూడా ముఖ్యం.
.
2.
వెండి వినాయకుడు
ఒక వెండి వినాయక విగ్రహంను మీరు ఖ్యాతి మరియు ప్రచారం కోసం
కోరుకుంటారు. మీ సేకరణలో ఏదైన వెండి వినాయక విగ్రహం కలిగి
ఉంటే,ఆగ్నేయంలో,వెస్ట్ లేదా వాయువ్య దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం,
సౌత్ లేదా నైరుతి దిశలో ఈ వెండి విగ్రహాలను ఎప్పుడూ ఉంచకూడదు.
పూర్తిటపా చదవండి...

Toll Free Numbers

Posted: 18 Jun 2015 07:26 AM PDT

రచన : VENKATA RAMANA | బ్లాగు : Information- for u
555.PNG




... పూర్తిటపా చదవండి...

ఒక ఆకు

Posted: 18 Jun 2015 06:33 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ఎవరూ లేని నా గదిలో - వొంటరిగా - చెట్టు లేని ఒక ఆకు.
నిన్నటి వరకూ అది ఒక ఆకాశం, వర్షం, జీవంతో తొణికిసలాడే భూమీ.
నిన్నటి వరకూ అది ఒక పాప, నవ్వులతో విరగబూసే ఒక స్త్రీ
పిల్లల్ని భుజాలపై ఎక్కించుకుని ఆటలాడే ఒక తండ్రీ -

అయితే, ఒక సాయంకాలపు రాత్రి అది అనాధగా మారింది.
గూటినుంచి తరిమి వేయబడగా దారి తప్పిన పిట్టలా మారింది. మరణానికి చేరువై,
బయట వీచే గాలిని తాకలేక పాలిపోయింది. కమిలిపోయింది -

ఏమీ లేదు
హీనులు, అకారణంగా ఒక చెట్టుని కొట్టివేసారు. మరో ఆకు

ఎవరూ లేని నా గదిలో ఈ పూట పూర్తిగా శిధిలమయింది.
... పూర్తిటపా చదవండి...

మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు… రాబర్ట్ బ్రిడ్జెస్, ఇంగ్లీషు కవి

Posted: 18 Jun 2015 02:19 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనిద్దరిలో ఒకరు ముందు పోవలసినపుడు

అది నేనే కావాలని కోరుకుంటున్నాను,

ఎప్పటిలా ఇంటిలో హాయిగా ఉండు

అలా అయితేనే నే కోరుకున్నది జరుగుతుంది.

నా మనసుకూడా నీది చేసుకుని

నీ మోకాళ్ళమీద బిడ్డకి పాటపాడు,

లేదా, ఒంటరిగా నీలో నువ్వు

నీ కోసం రాసిన పాటలు చదువ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger