Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 4 June 2015

దారీ తెన్నూ లేక… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

దారీ తెన్నూ లేక… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


దారీ తెన్నూ లేక… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

Posted: 04 Jun 2015 12:46 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చిత్తడినేల అంటే ఏమిటో తెలీదు,

సముద్రాన్ని ఎన్నడూ చూసి ఎరగను

కానీ, నాకు అడవిపొదలెలా ఉంటాయో తెలుసు

కెరటం అంటే ఊహించుకోగలను.

నేను దేవుడితో ఎప్పుడూ మాటాడలేదు

స్వర్గాన్ని ఎన్నడూ చూడలేదు

కానీ నాకు పటం చూసినంత స్పష్టంగా

అదెక్కడుంటుదో ఖచ్చితంగా తెలుసు... పూర్తిటపా చదవండి...

ఉల్లిపాయ

Posted: 04 Jun 2015 12:17 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
తన పొరల పొరల దు:ఖాన్ని ముక్కలుగా కోస్తూ కంటతడిపెడుతుంది. పచ్చగానే కనిపిస్తున్న ఓ జీవితపు మిరప హంత కారమైనందుకు హాచ్చర్యపోతూనే వుంటుంది. పళ్ళెలలో వడ్డింపబడుతున్న ప్రతిసారీ మనసుని తేలిక చేసుకుంటూ మరింతగా కరిగుతూనే వుంటుంది. ఆమె మా అమ్మకావచ్చు నా బిడ్డకి అమ్మకావచ్చు. ... పూర్తిటపా చదవండి...

ఒంటరితనంలోకి..

Posted: 03 Jun 2015 09:37 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
అందరూ ఉన్నట్లే వుంటుంది, అకస్మాత్తుగా ఒంటరితనం పరుచుకొంటుంది
డాబామీది పావురాయి రెక్కల్నీ, కువకువల్నీ, నీడనీ వెంటపెట్టుకొని ఎగిరిపోతుంది
పావురాయి ప్రపంచం ఖాళీ అయినచోట శూన్యం సుడితి... పూర్తిటపా చదవండి...

మేమంతా క్షేమం! – 2. నా జన్మపత్రిక

Posted: 03 Jun 2015 09:30 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
జ్యేష్ట బహుళ విదియ స్థిరవాసరము – తెలుగు పంచాంగంప్రకారం నేను పుట్టిన శుభదినం. [Dear Jagannatha Rao,You have been blessed with a daughter at 10/20 on the 26th instant. Both mother and baby are safe. Diet will be given today. … Yours Kotcherlakota Surya Rao] నెలరోజుల క్రితం నా భోషాణం తెరిచి అట్టడుగు కాయితాలు తవ్వి తీసి చూస్తుంటే ఈ పురావిశేషం దొరికింది – […]... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 228- ఆనెగొంది ఆంజనేయస్వామి –హాస్పేట

Posted: 03 Jun 2015 07:34 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

228- ఆనెగొంది ఆంజనేయస్వామి –హాస్పేట

కర్నాటక రాష్ట్రం బళ్ళారి దగ్గరున్న హాస్పేట్ కు సమీపం లో ఆనెగొంది చారిత్రక ప్రదేశం .దీనికి సమీపం లో అంజనాద్రి పై శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు .ఆనే గొంది అంటే కన్నడం లో ''ఏనుగుల మడుగు .ఇక్కడే ఏనుగులు విశ్రాంతి తీసుకొనేవి .''కృష్ణ దేవరాయల కాలం లో విజయనగర సామ్రాజ్యం లో దీనికి ప్రాధాన్యం ఉంది .అలాగే రామాయణ కాలానికీ ఈ ప్రదేశానికి సంబంధం ఉంది .తుంగ భద్రా తీరం లో కొప్పల్ జిల్లా గంగావతి తాలూకాలో ఆనెగొంది ఉంది .హంపికి ఇది అయిదు కిలో మీటర్ల దూరం .ఇదే రామాయణం లోని కిష్కింద .ఇది విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేక దిశలో ఉంటుంది... పూర్తిటపా చదవండి...

శ్రీ లలితాంబిక సహస్రనామావళి

Posted: 03 Jun 2015 07:05 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! జగజ్జనని శ్రీ లలితాంబిక సహస్రనామావళిని వినినను, చదివినను, పారాయణ చేసిననుమనలోని  అజ్ఞానమంతయు నశించి జ్ఞానజ్యోతి మనలో ప్రభవించును. అట్టిలితా సహస్రనామావళిని, వింటూ చూస్తూ,  అర్థాన్ని, భావాన్ని గ్రహిస్తూ, పారాయణ చేస్తూ తరించండి.

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

మ్యాగి అమ్మకాలు నిషేధం

Posted: 03 Jun 2015 06:13 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
images.jpg
మధ్య టీవీ యాడ్స్‌ లో ఆటా నూడుల్స్‌, వీట్‌ నూడుల్స్‌ అని వస్తున్నాయి చూసారా! ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అని సినిమా తారలతో చెప్పిస్తున్నారు. ఆరోగ్యం అంటే ఎవరు మాత్రం వెనుకడుగు వేస్తారు చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో విరివిగ... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - శ్రీ మద్విఖ్యాతిలతా

Posted: 03 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

9-1-ram.jpg
7-1-కంద పద్యము

పూర్తిటపా చదవండి...

ఆనంద తాండవమాడే శివుడు

Posted: 03 Jun 2015 05:45 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు

tandava.jpg

ఆనంద తాండవమాడే శివుడు అనంత లయుడు చిదంబర నిలయుడు

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger