Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 2 August 2015

“భూతలం” – భమిడిపాటి వారి రైలు ప్రయాణం ... మరో 6 వెన్నెల వెలుగులు

“భూతలం” – భమిడిపాటి వారి రైలు ప్రయాణం ... మరో 6 వెన్నెల వెలుగులు


“భూతలం” – భమిడిపాటి వారి రైలు ప్రయాణం

Posted: 02 Aug 2015 09:36 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
రైలు ప్రయాణాలు అందరం చేస్తూనే వుంటాము కాని ఆ అనుభవాలను గ్రంధస్తం చెయ్యటం అందరికి చేతకాదు. మొక్కపాటి వారి పార్వతీశం రైలు ప్రయాణం మనకందరికీ తెలిసిందే. హాస్య వ్యాసాలూ రాయటంలో అందెవేసినచేయి భమిడిపాటి కామేశ్వరరావు గారిది. మరి వారి ఈ వ్యాసం ౧౯౪౮ నాటి కిన్నెర సంచిక నుండి 

హిందూ ధర్మం - 169 (శిక్షా - 3)

Posted: 02 Aug 2015 09:19 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
శబ్దాల యొక్క శక్తిని, అక్షరముల వైభవాన్ని చూశాం. మరి వేదమంత్రాల యొక్క పరిపూర్ణశక్తిని మానవుడు పొందాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నా గురువులలో ఒకరికి వారి గురువుగారు వేదంలోని ఒక అతి రహస్య విద్యను నేర్పిస్తూ మంత్రపఠనం గురించి ఇలా హెచ్చరించారు. 'నేను నీకు నేర్పే విద్య అత్యంత కఠినమైనది, అది సక్రమంగా జరిగితే శుభఫలితాలు కలుగుతాయి. మంత్రపఠనంలో కానీ, కర్మలో కానీ చిన్న పొరపాటు దొరిలినా, చాలా దుష్పరిణామాలు చవి చూడవలసి వస్తుంది. జాగ్రత్తగా చదివితే ప్రపంచానికి మేలు జరుగుతుంది, కాస్త పొరపాటు జరిగినా అది ఉపద్రవానికి దారి తీస్తుంది. అందువల నీకు చేసే విద్యాబోధన కూడా... పూర్తిటపా చదవండి...

సూత్రం

Posted: 02 Aug 2015 09:07 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
పెద్దగా ఏమీ ఉండదు: నువ్వు గుర్తుకు వచ్చినప్పుడు
ఎక్కడో ఏదో విరిగిపడి, లోపల లోతు తెలియని కందకం ఒకటి ఏర్పడి
ఇక, ఒక తపన - లోపల:

తల దాచుకునేందుకు, ఒక గూటి కోసమో
ఒక అరచేయి కోసమో, గూడు వంటి, ప్రమిదె వంటి ఒక శరీరం కోసమో, చివరికి
ఒకే ఒక్క  పలుకరింపు కోసమో

రాత్రుళ్ళలో, ఈ దిగులు కందకాలలో, గోడలపై
వ్యాపించే నీడల్లో, వీచే గాలుల్లో, నేల రాలి దొరలిపోయే పూలల్లో, ఆకుల్లో
మోకాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకుని

లోపలికి ఒదిగొదిగిపోయి కంపించే క్షణాలల్లో
ఒక తండ్లాట. ఒక యాతన. ఒక శిక్ష -
నిజం. నన్ను నమ్ము
... పూర్తిటపా చదవండి...

రెక్కలపైన రంగవల్లికలు;

Posted: 02 Aug 2015 09:06 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
సీతాకోకచిలకమ్మలవే 
వచ్చేసాయి, వచ్చేసాయి! ||

రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు -
వచ్చేసాయి, వచ్చేసాయి ||  

<... పూర్తిటపా చదవండి...

కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి ఇంటి చిట్కాలు

Posted: 02 Aug 2015 08:56 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : Kaalla pagullu povalante emi cheyali,beauty in telugu, beauty tips, Cracked, Cure, Feet, Health, Health tips, kalla andam, padalu, pagullu, telugu,Simple home tips for Foot Care,FOOT CARE TIPS,Buatyful Foot Tips In Telugu,Foot Care Tips,Homemade remedies for cracked heels, home remedies cracked heels, Glycerin, Take Paraffin wax, paraffin oil, Vaseline, hydrogenated vegetable oil,, Homema... పూర్తిటపా చదవండి...

రక్తస్పర్శ - శారద కథలు

Posted: 02 Aug 2015 06:25 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
భవిష్యత్తు దర్శనం చేయగలిగే వారిని 'ద్రష్ట' లు అంటారు. సాహిత్యంలో, మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో ఇలాంటి వారు కనిపిస్తారు. కాలపరిక్షకి నిలబడడమే కాదు, ఏ కాలంలో చదివినా 'ఇది ఈ కాలానికి సరిపోయే రచన' అనిపించడం వీరి రచనల ప్రత్యేకత. ఇలాంటి ద్రష్టల జాబితాలో 'శారద' కలం పేరుతో కలకాలం నిలిచిపోయే రచనలు చేసిన ఎస్. నటరాజన్ ది చెదరని స్థానం. శారద కథలు ఆపకుండా చదివిస్తాయి.. పదేపదే వెంటాడతాయి కూడా.

జన్మతః తమిళుడైన నటరాజన్, యవ్వనారంభంలో పొట్టకూటి కోసం తెనాలికి వలస వచ్చి, హోటల్ సప్లయర్ గా పనిచేస్తూ రాత్రి వేళల్లో తెలుగు... పూర్తిటపా చదవండి...

స్నేహాన్ని తలుచుకోవాలా?

Posted: 02 Aug 2015 04:35 AM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
IMG_5376.JPG

Every friendship starts when a heart extends a han... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger