Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 16 November 2021

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 10.2-841-క. చటులపురత్రయదనుజో త్కటదుస్తర బాధ్యమానధారుణిగతి న ప్పుటభేదన మెంతయు వి స్ఫుటపీడం జెంది వగల సుడివడుచుండన్. 10.2-842-చ. కని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు రౌక్మిణేయుఁ డ జ్జనముల నోడకుండుఁ డని సంగరకౌతుక మొప్ప దివ్య సా ధనములఁ బూని సైనిక కదంబము గొల్వ ననూన మీన కే తన రుచి గ్రాల నున్నతరథస్థితుఁడై వెడలెన్ రణోర్వికిన్. భావము: త్రిపురాసురులవల్ల బాధపడిన భూలోకం లాగ ద్వారకానగరం సాల్వుడిచేత మిక్కిలి ఇక్కట్లపాలై దుఃఖంతో కలత చెందింది. అది చూసి మహాప్రభావశాలి రథికశ్రేష్ఠుడు అయిన రుక్మిణీ పుత్రుడు ప్రద్యుమ్నుడు ప్రజలకు ధైర్యం చెప్పి, మీనకేతనం ప్రకాశిస్తున్న ఉన్నతమైన రథం ఎక్కి, మహోత్సాహంతో అస్త్రశస్త్రాలను ధరించి, సైన్య సమేతంగా యుద్ధభూమికి బయలుదేరాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=63&Padyam=842 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : - Aditya Srirambhatla

( సాల్వుండు ద్వారకన్నిరోధించుట) 10.2-841-క. చటులపురత్రయదనుజో త్కటదుస్తర బాధ్యమానధారుణిగతి న ప్పుటభేదన మెంతయు వి స్ఫుటపీడం జెంది వగల సుడివడుచుండన్. 10.2-842-చ. కని భగవంతుఁడున్ రథిశిఖామణియున్నగు... [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Tue, 16 Nov 2021 07:22:18 PST
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger