Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 20 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౭(607) - Aditya Srirambhatla

( వృకాసురుండు మడియుట ) 10.2-1264-క. "మానవనాయక! యీ యా ఖ్యానముఁ జదివినను వినిన ఘనపుణ్యులు ని త్యానంద సౌఖ్యములఁ బెం పూనుదు రటమీఁద ముక్తి నొందుదు రెలమిన్!" 10.2-1265-వ. అని చెప్పి శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 10.2-1266-క. "జననాయక! యింకఁ బురా తనవృత్తం బొకటి నీకుఁ దగ నెఱిఁగింతున్. వినుము తపోమహిమలఁ జెం దిన మునిజనములు సరస్వతీనది పొంతన్. భావము: ఈ వృకాసుర వృత్తాంతం వినిన పుణ్యాత్ములు నిత్యం సుఖసంతోషాలతో జీవిస్తూ తుదకు మోక్షం పొందుతారు. ఇలా ఈ ఉపాఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పి శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఇంకా ఇలా అన్నాడు. "మహారాజా! నీకు ఇంకొక పురాతనగాథ చెబుతాను విను. పూర్వం తపోధనులైన మునులు ఎందరో సరస్వతీనదీ తీరంలో ఉండేవారు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1266 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sat, 20 Aug 2022 13:41:33 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger