Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 August 2022

శ్రీకృష్ణ విజయము - ౬౦౯(609) - Aditya Srirambhatla

( భృగుమహర్షి శోధనంబు ) 10.2-1270-క. మనమునఁ గలఁగుచు భృగుఁ దన తనుజాతుం డనుచు బుద్ధిఁ దలఁచినవాఁడై ఘనరోషస్ఫురితాగ్నిని ననయము శాంతోదకముల నల్లన నార్చెన్. 10.2-1271-చ. మహితతపోధనుండు మునిమండనుఁ డయ్యెడఁ బాసి వెండియు న్నహిపతిభూషుఁ గాన రజతాద్రికి నేగిన నగ్గిరీంద్రుపైఁ దుహినమయూఖశేఖరుఁడు దుర్గయుఁ దానును విశ్రమించుచున్ దృహిణతనూభవుండు సనుదెంచుట కాత్మఁ బ్రమోదమందుచున్. భావము: చతుర్ముఖుడు తన మనసులో కలతపడ్డాడు. భృగువు తన కొడుకే కదా అనుకుని, బ్రహ్మదేవుడు తన రోషాన్ని ఎలాగో చల్లార్చుకున్నాడు. ఆ మహాతపశ్శాలి, మునివరుడు, భృగుమహర్షి బ్రహ్మదేవుడి సభనుండి నిష్క్రమించి, నాగాభరణుడు అయిన ఈశ్వరుని కోసం కైలాస పర్వతం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ వెండికొండ మీద విశ్రమించి ఉన్న పార్వతీపరమేశ్వరులు బ్రహ్మదేవుని పుత్రుడు అయిన భృగువు రాకకు సంతోషించారు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1271 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 25 Aug 2022 16:25:27 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger