Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 29 August 2022

హ్యాకర్ల విషయం లో చైనా యే దిట్ట. - Unknown

(Google Pic) తెల్లారి లేచింది మొదలు మన జీవితాలు ఇంటర్ నెట్ తో ముడిపడిఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రతి రోజు ఏదో సైబర్ నేరం గురించి చదవడం మనకి నిత్యకృత్యమై పోయింది. కాని అసలు నేరస్థులు దొరకడం ఇప్పటికీ గగనం గానే ఉంది.చాలా కేసుల్లో ఆనూపానూ దొరకడం లేదు.దానికి కారణం సైబర్ నేరస్థులు లేదా హ్యాకర్లు అందాం,ఇతర దేశాల్లో ఉండటం వల్ల అంతర్జాతీయ వ్యవస్థల సహకారం లేనిదే దొరకడం కష్టమైపోతున్నదని మనం చదువుతున్నాం. ప్రపంచం లోనే ఎక్కువ హ్యాకర్లు ఉన్న దేశం చైనా అని సర్వే వివరాలు తెలుపుతున్నాయి.అంతేకాదు,సైబర్ నిఘా పెట్టడం లో కూడా చైనా ముందు వరుస లో ఉన్నది.ఆ తర్వాత రష్యా,అమెరికా లు ఉన్నాయి.అలాగే సైబర్ నేరగాళ్ళ వల్ల ఎక్కువ మొత్తం లో నష్టపోతున్న దేశం కూడా చైనా దేశమే.ఏడాదికి 66.3 బిలియన్ డాలర్లని కోల్పోతున్నదట.ఆ తర్వాత స్థానాల్లో బ్రెజిల్,అమెరికా,ఇండియా ఉన్నాయి. సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా పెద్ద ఎత్తున ధనాన్ని సులభం గా సంపాదించడానికి ఈ మార్గం ఎన్నుకుంటారు.బ్యాంక్ లు,కేసినోలు,ఆర్ధిక వాణిజ్య సంస్థలు ఇంకా వ్యక్తుల్ని కూడా తమ టార్గెట్ గా పెట్టుకుంటారు.మనదేశం లో ఆన్ లైన్ నేరాలు చేయడం లో జాంతార అనే జిల్లా లోని కర్మ తండ్ అనే చిన్న పట్టణం ముందు వరుస లో ఉంది.ఇంకా వింతైన విషయం ఏమిటంటే ఎంతో వెనుకబడిన రాష్ట్రం గా చెప్పుకునే జార్ఖండ్ లో ఈ జిల్లా ఉంది. 19 వ శతాబ్దం లో,సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఈ ప్రాంతం లోని వెనుకబడిన వర్గాల బాలికల విద్య కోసం ఎంతో కృషిచేశాడు. ఈ జార్ఖండ్ లోని సైబర్ గ్యాంగ్ లు ఓటిపి ఫ్రాడ్ లు చేయడం లో ఇంకా డెబిట్,క్రెడిట్ కార్డులతో మోసం చేయడం,ఇంకా అమాయక జనాల్ని నమ్మించి మోసం చేయడం లో సిద్ధహస్తులు.2020 లో ఎక్కువ గా సైబర్ నేరస్థుల బారినపడింది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం.11 వేల కేసులు నమోదు అయ్యాయి.ఆ తర్వాత బెంగుళూరు,హైదరా బాద్,ముంబాయి,ఘజియా బాద్ లలో నమోదు అయ్యాయి. 2021 లో మొట్టమొదటి సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ బెంగుళూరు లో స్థాపించారు.అయితే సైబర్ పోలీస్ స్టేషన్ ని ప్రతి జిల్లా లోనూ పెట్టి,ఒక ప్రత్యేక శాఖ గా పరిగణించిన రాష్ట్రం గా మహారాష్ట్ర ని చెప్పాలి.మొట్టమొదటి సైబర్ క్రైం మన దేశం లో 1992 లో నమోదయింది. అతగాడి పేరు ఆకాష్ అరోరా ,అతను పోలీ మర్ఫిక్ అనే వైరస్ ని ప్రవేశపెట్టాడు. ఇప్పటిదాకా మన దేశం లో 6,74,021 సైబర్ అటాక్స్ జరిగాయి.అంటే ప్రతిరోజు 3,700 అటాక్ లు జరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ విషయం లో అగ్ర స్థానం లో ఉన్న దేశం డెన్మార్క్ అని తేల్చారు.సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పోస్యూర్ ఇండెక్స్ లో 8.91 స్కోర్  తెచ్చుకొని నంబర్ వన్ గా నిలిచింది.సాధ్యమైనంతవరకు బలమైన పాస్ వర్డ్ లు వాడటం,బయట ప్రదేశాల్లో నెట్ ని వాడకుండా ఉండటం,ఫిషింగ్ మాల్ వేర్ ని పంపే లింక్ ల్ని ఓపెన్ చేయకుండా ఉండటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చేయడం మంచిది. ---- NewsPost Network
Post Date: Sun, 28 Aug 2022 23:18:44 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger