Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 1 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౬(616) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1282-సీ. అధికశోకంబున నలమటఁ బొందుచు- నచ్చటి జనులతో ననియెఁ బెలుచ "బ్రాహ్మణ విద్వేషపరుఁ డయి తగ శాస్త్ర- పద్ధతి నడవక పాపవర్తి యై క్షత్రబంధువుఁ డగు వాని దురితంబు- చేత మత్పుత్త్రుండు జాతమైన యప్పుడ మృతుఁ డయ్యె నక్కట! హింసకు- రోయక యెప్పు డన్యాయకారి 10.2-1282.1-తే. యగుచు విషయానుగతచిత్తుఁ డైన యట్టి రాజుదేశంబు ప్రజలు నిరాశు లగుచు దుఃఖములఁ జాల వనటఁ బొందుదు ర"టంచు నేడ్చుచును నట నిల్వక యేగె నపుడు. భావము: దుర్భరశోకంతో కుమిలిపోతున్న ఆ విప్రుడు అక్కడి ప్రజలతో "బ్రాహ్మణద్వేషి, శాస్త్రాచారాన్ని పాటించని వాడు, పాపాత్ముడు అయిన క్షత్రబంధువు చేసిన పాపం వలన నా కుమారుడు పుట్టగానే చచ్చిపోయాడు. దేశాన్ని ఏలే రాజు హింసను ఏవగించుకోకుండా, న్యాయానికి దూరుడు, ఇంద్రియలోలుడు అయితే ఆ ప్రజలు నిరాశతో దుఃఖాలవలన అధికమైన కష్టాలను పొందుతారు." అని ఏడుస్తూ ఇక అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1282 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 01 Sep 2022 16:08:41 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger