Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 5 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౧౯(619) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1286-తే. వినుతబలు లైన యాదవ వీరవరులుఁ గలుగ వారలచేఁ గాని కార్య మీవు చక్కఁబెట్టుట యెట్లు? నీచనెడు త్రోవఁ బొమ్ము" నావుడు నయ్యింద్రపుత్త్రుఁ డపుడు 10.2-1287-క. మనమున దురహంకారము ఘనముగఁ బొడముటయు, నపుడు కవ్వడి విప్రుం గనుఁగొని యచ్చటిజనములు వినఁగా నిట్లనియె రోషవిహ్వలమతియై. భావము: ప్రశంసించదగిన బలం కలిగిన యాదవవీరులు ఉండగా, వారిచేతనే కాని పనిని చక్కపెట్టడం నీవు ఎలా చేయగలవు కానీ, నీ దారిన నీవు వెళ్ళు." ఇలా అంటున్న ఆ బ్రాహ్మణుడి మాటలు వినిన ఇంద్రతనయుడు అర్జునుడి మనసులో దురహంకారం పెచ్చుమీరింది. రెండు చేతులతో వడిగా బాణాలు వేయగలిగిన ఆ మహావీరుడు రోషంతో వశంతప్పి, అక్కడి జనాలు అందరు వినేలా విప్రుడితో ఇలా అన్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1287 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Mon, 05 Sep 2022 15:15:52 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger