Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 22 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౪(634) - Aditya Srirambhatla

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 10.2-1314-క. "ధరణికి వ్రేఁ గగు దైత్యులఁ బొరిబొరి వధియించి ధర్మమున్ నిలుపుటకై ధర జనియించితి రిరువురు నరనారాయణు లనంగ నా యంశమునన్. 10.2-1315-క. ఆరూఢ నియతితోఁ బెం పారిన మిము నిమ్మునీంద్రు లర్థిం జూడం గోరిన మీ వచ్చుటకై ధారుణిసురసుతుల నిటకుఁ దగఁ దేవలసెన్. " భావము: "భూమికి భారమైపోయిన రాక్షసులను వధించి, ధర్మాన్ని రక్షించడం కోసం నా అంశతో మీరిద్దరు నరనారాయణులుగా జన్మించారు. మహానిష్ఠతో ఉన్నతులైన మిమ్మల్ని ఈ మనీశ్వరులు చూడాలని కోరారు. అందుకని, మీరిక్కడకు రావాలనే ఉద్దేశంతో ఆ బ్రాహ్మణుని కుమారులను ఇక్కడకు తెప్పించవలసివచ్చింది." http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1314 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 22 Sep 2022 15:57:13 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger