Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 22 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౩౫(635) - Aditya Srirambhatla

( మృత విప్రసుతులఁదెచ్చుట ) 10.2-1316-క. అని "యా డింభకులను దో కొని పొం" డని యిచ్చి వీడుకొలిపిన వారల్‌ వినతు లయి పెక్కు విధముల వినుతించుచు నచటు వాసి విప్రునిసుతులన్. 10.2-1317-వ. తోడ్కొని సంప్రాప్త మనోరథు లయి య బ్బాలకులఁ ద త్తద్వయో రూపంబులతోడఁ దెచ్చి యాబ్రాహ్మణునకు సమర్పించిన నతండు సంతుష్టాంతరంగుం డయ్యె; న య్యవసరంబున. భావము: అని పిమ్మట "ఈ బాలకులను మీరు తీసుకుని వెళ్ళండి" అని పలికి ఆ బాలకులను అప్పజెప్పి విష్ణువు వారికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. శ్రీకృష్ణార్జునులు వినయంతో భగవంతుడిని అనేక విధాల స్తుతిస్తూ బ్రాహ్మణపుత్రులతో అక్కడ నుండి బయలుదేరారు. కోరిన పని సాధించి సఫల మనోరథులు అయిన కృష్ణార్జునులు వారి వారి వయసులకు తగిన ఆకారాలతో ఉన్న ఆ విప్రసుతులను వెంటబెట్టుకుని వచ్చి బ్రాహ్మణుడికి అప్పజెప్పారు. ఆ బిడ్డలను చూసిన ఆ విప్రుడు ఎంతో ఆనందం పొందాడు. అంతట.... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=86&Padyam=1317 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 22 Sep 2022 15:58:23 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger