Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 27 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౦(640) - Aditya Srirambhatla

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 10.2-1328-ఉ. "వారక కృష్ణుఁ డిప్పగిది వైదికవృత్తి గృహస్థధర్మ మే పారఁగ బూని ధర్మమును నర్థముఁ గామము నందుఁ జూపుచుం గోరికమీఱ సజ్జనులకుం గతి దాన యనంగ నొప్పి సం సారిగతిన్ మెలంగె నృపసత్తమ! లోకవిడంబనార్థమై. 10.2-1329-సీ. హరి యిట్లు గృహమేధి యగుచు శతోత్తర- షోడశసాహస్ర సుందరులను మును నీకు నెఱుఁగఁ జెప్పినరీతి నందఱ- కన్నిరూపములు దా నర్థిఁ దాల్చి కైకొని యొక్కక్క కామినీమణి యందు- రమణ నమోఘ వీర్యమునఁ జేసి పదురేసి కొడుకులం బడసె రుక్మిణ్యాది- పట్టమహిషులకుద్భవులు నైన 10.2-1329.1-తే. నందనులలోన ధరణి నెన్నంగ బాహు బల పరాక్రమ విజయ సంపద్విశేష మాని తాత్ములు పదునెనమండ్రు; వారి నెఱుఁగ వినిపింతు, వినుము రాజేంద్రచంద్ర! " భావము: "రాజోత్తమా! పరీక్షిత్తూ! ఈ విధంగా వేదోక్తమైన పద్ధతిలో గృహస్థధర్మాన్ని స్వీకరించి, ధర్మార్ధ కామాదులను సాధిస్తూ, ఉత్తములకు తానే దిక్కు అయి ఉంటూ, లోకం తనను అనుసరించి ఇలా నడవాలి అని తెలుసుకునేలా, తానూ ఒక సంసారిలా శ్రీకృష్ణుడు నటించాడు. పరీక్షిత్తు మహారాజా! ఈ విధంగా పదహారువేల సుందరీమణులకు అందరకూ అన్నిరూపాలు ధరించి గృహస్థుడై శ్రీకృష్ణుడు ఏలుకున్నాడు. అమోఘ వీర్యుడైన ఆ మహానుభావుడికి, వారిలో ఒక్కొక్కరి యందు పదిమంది చొప్పున పుత్రులు పుట్టారు. రుక్మిణి మొదలైన పట్టమహిషులకు పుట్టిన పుత్రులలో పదునెనిమిదిమంది భుజబల, పరాక్రమ, వైభవాలతో ప్రసిద్ధులయ్యారు. వారి పేర్లను చెప్తాను. శ్రద్ధగా విను." http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=87&Padyam=1329 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 27 Sep 2022 15:45:43 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger