Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 4 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౫(645) - Aditya Srirambhatla

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 10.2-1336-వ. ఇవ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామా నుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె" నని చెప్పి మఱియు నిట్లనియె. 10.2-1337-మ. "మనుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె ప్పిన యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో లిన పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై యనయంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బై నట్టి కైవల్యమున్. " భావము: ఈలాగున గోపికామన్మథుడు అయిన శ్రీకృష్ణుడు లీలామానుష రూపం ధరించినవాడు అయి తన రాజధాని ఐన ద్వారకలో లోకాతీత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు." అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు. "ఓ మహారాజా! నేను నీకు చెప్పిన ఈ శ్రీకృష్ణకథారసం ముల్లోకాలకూ శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు." http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1337 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 04 Oct 2022 15:28:07 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger