( భూభారంబు వాపుట ) 11-3-మ. "బలవత్సైన్యముతోడఁ గృష్ణుఁడు మహాబాహా బలోపేతుఁడై కలనన్ రాక్షసవీరవర్యుల వడిన్ ఖండించి, భూభారము జ్జ్వలమై యుండఁగ ద్యూతకేళి కతనం జావంగఁ గౌరవ్య స ద్బలముంబాండవ సైన్యమున్నడఁచె భూభాగంబు గంపింపఁగన్. 11-4-వ. అంత. 11-5-క. మునివరులు సంతసిల్లిరి యనయము నందాదులకును హర్షం బయ్యెం; దన నిజభక్తులు యాదవ ఘనవీరసమూహ మపుడు గడు నొప్పెసఁగెన్. భావము: "శ్రీకృష్ణుడు మిక్కిలి బలమైన సైన్యంతో గొప్ప భుజబలం కలవాడై యుద్ధంలో గొప్ప రాక్షసవీరులను వడివడిగా వధించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండటం చేత ద్యూతక్రీడ వంక పెట్టి భూమి అదిరిపోయేలా కౌరవపాండవ యుద్ధం జరిపించి ఉభయ సైన్యాలను హతమార్చాడు. అప్పుడు మునీశ్వరులు, ఆ దుష్ట శిక్షణకు సంతోషించారు. తన భక్తులు, మహావీరులు అయిన యాదవులు అప్పుడు మిక్కిలి వృద్ధిచెందుతుండుట చూసి నందుడు మొదలైనవారు చాలా సంతోషించారు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=1&Padyam=5 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Fri, 07 Oct 2022 15:47:25 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 07 Oct 2022 15:47:25 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment