Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 12 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౨(652) - Aditya Srirambhatla

( కృష్ణ సందర్శనంబు ) 11-12-సీ. ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ,- గర్ణకుండలయుగ్మఘనకపోలుఁ, బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ,- గలిత నానారత్న ఘన కిరీటు, నాజానుబాహు నిరర్గళాయుధహస్తు,- శ్రీకరపీతకౌశేయవాసు, రుక్మిణీనయన సరోజ దివాకరు,- బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము , 11-12.1-తే. దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ, గోటిమన్మథలావణ్యకోమలాంగు, నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ, గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు. 11-13-క. వచ్చిన మునిసంఘములకు విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌ మెచ్చగు కనకాసనముల నచ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌. భావము: మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు. అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=12 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Wed, 12 Oct 2022 13:41:18 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger