Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 16 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౫౬(656) - Aditya Srirambhatla

( కృష్ణ సందర్శనంబు ) 11-19-క. దర్పించి యాదవులు తమ నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం బేర్పడ శృంగారించియుఁ గర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌. 11-20-ఉ. మూఁకలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం బోకలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం "బ్రాకటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో యేకత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు" డటన్న నుగ్రులై. భావము: అక్కడ ఆ మునివేరేణ్యులను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు. యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. "ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?" అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=4&Padyam=20 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Sun, 16 Oct 2022 15:22:41 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger