Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 17 October 2022

పెద్దరికం - డా.ఆచార్య ఫణీంద్ర

అంకగణిత మందు నంకె "తొమ్మిది" గ్రుద్దె నంకె "యెనిమిది" వీ పదరునట్లు! "ఏల కొట్టితి?" వంచు "నెనిమి" దడుగ - నద్ది "పెద్దదాన" ననుచు విర్ర వీగె! "ఎనిమి" దపుడు గ్రుద్దె "నేడు" నుక్రోషాన! "ఏడు"  నట్టులె "యారు"; నిట్లె యన్ని! ఉరికి పారెడు "సున్న" "నొకటి" యాపి - "భయము వల" దటంచును, తన ప్రక్క నిలిపె! "రెండు" చూచు సరికి "పది" యుండె నచట! బెదరి "రెండు" తానే పారు, టదియె గాంచి, "సున్న" "యొకటి"తో నపుడనె, స్తుతిని జేసి - "పెద్ద యగుదు రితరులను పెద్ద సేయ!"
Post Date: Mon, 17 Oct 2022 02:17:35 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger