Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 21 October 2022

తాతకి దగ్గులు నేర్పడం. - sarma

తాతకి దగ్గులు నేర్పడం. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, పూర్తి జీవితం అనుభవించిన అనుభవజ్ఞునికి జీవితం గురించి చెప్పబోవడం అంటారు. ఇలా చెప్పబోయినవారు ఎవరూ? ఒక పిల్లకాకి, కళ్ళు పూర్తిగా తెరవని పసికూన, మనవడో/మనవరాలో, ఆ తాత కళ్ళెదుట పుట్టినవాళ్ళు, ఆ తాత చెయ్యిపట్టినడచినవాళ్ళు. ఇలా చెప్పబోయారంటే వారు జీవితంలో అప్పుడే అడుగుపెట్టినవారై ఉంటారు, అంటే వయసు పాతిక ముఫై మధ్య,అదే జీవితమనుకుని.  ఇక వీరి తండ్రి అంటే అరవై వయసు దగ్గరమాటే. మరితాతాంటే వీరితండ్రికదా! అంటే ఆయన వయసు ఎనభై ఆ పైమాటే కదా! ఇంతవయసు అనుభవమున్నవారికి జీవితంలో ఒడిదుడుకులగురించి చెప్పబోయినవారికి  మధ్య వయసుతేడా ఒక అర్ధశతాబ్ది, అనుభవంతేడా అంతే కదా!. మరీ తాత ఎనభై పైబడ్డ వయసులో ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఎంత మందిని చూసి ఉంటాడు. ఎన్ని రకాల మనుషులని చూసి ఉంటాడు? ధూర్తులు,దుర్మార్గులు,వంచకులు,  వదరుబోతులు,  స్వప్రయోజనపరులు,నమ్మించి మోసంచేసినవారు, ఇలా చెప్పుకుపోతే ఇది అనంతంకదా!   జీవిత పరుగులో ఎన్నిసార్లు పడిపోయి లేచి మళ్ళీ పరుగందుకుని ఉంటాడు, ఎంత కష్టపడి వీళ్ళని పెంచి ఉంటాడు?  నేడు కనుతెరచినవారింత అనుభవమున్నవారికి చెప్పబోవడమంటేనే తాతకి దగ్గులు నేర్పడం, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందనడం. దీనినే నక్కపుట్టి మూడు ఆదివారాలు కాలేదు ఇంతగాలివాన చూడలేదంది అన్నట్టు కదా!
Post Date: Fri, 21 Oct 2022 03:09:06 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger