Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 24 October 2022

తాటాకు టపాకాయలు - sarma

దీపావళి శుభకామనలు. (సినీవాలి శుభకామనలు) తాటాకు టపాకాయలు తాటాకు టపాకాయలు దీపావళికి కాల్చడం ఆనవాయితీ. వీటి తయారు మాత్రం సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉంటుంది. మామూలు తాటాకులు పనికి రావు, చిట్టిమట్టల ఆకులు తెచ్చుకుని ఎండబెట్టి, ఆ పై మట్టలు నరికి, ఓపికగా కూచుని ఒక్కొక్క ఆకునూ వేరు చేసి, ఈనెలు తీసి, అకుల్ని లెక్కబెట్టి కట్టగట్టాలి. మాదగ్గరలో మందుగుండు తయారు చేసేవారున్నారు.వారు ఈ తాటాకులు కొనుక్కుపోతుంటారు. ఆకును తయారుచేయడానికి ఓపిక శ్రద్ధ కావాలి.సంవత్సరం పొడుగునా చేయాలి, ఒక రోజులో అయేపని కాదు. ఇంత కష్టపడ్డా మిగిలేది తక్కువ శ్రమ ఎక్కువ. ఇక తాటాకు టపాకాయల్లో ఉపయోగించేది సూరేకారం,  పటాసు ,  గంధకం,బొగ్గుపొడి, ఒక్క జొన్నగింజ. ఒక తాటాకును ముక్కచేసి పైచెప్పినవాటిని అందులో వేసి ఒక వత్తిని మూలగా బయటికి పెట్టి ఆకును మడతపెట్టి, మిగిలిన ఆకును దానిపై ఒడుపుగా దానిపైచుట్టి బిగిస్తే టపాకాయ తయారు. బిగింపులో కూడా పేలుడు తేడా ఉంటుంది. Courtesy. What's app ఢిల్లీ దీపావళి సంబరం
Post Date: Mon, 24 Oct 2022 03:02:54 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger