Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 30 October 2022

Titanic సినిమా - ఓ పరిశీలన - Unknown

Titanic అనే హాలీవుడ్ సినిమా ఎంత సంచలనం రేపి ప్రపంచం లోని అనేక దేశాల్లో సినిమా ప్రియుల్ని అలరించిందో మనకి అందరికి తెలుసు.ప్రేమ కథా చిత్రాలకి ఎప్పటికి ఎదురుండదు,కాకపోతే దాంట్లో పడే పాళ్ళు సరిగ్గా పడాలి అంతే. అప్పుడు ఆర్టిస్ట్లు ఏ దేశాం వాళ్ళు,ఏ భాషలో తీశారు అనేది కూడా ఆలోచించరు జనాలు.దానికి సరైన ఉదాహరణ ఈ టైటానిక్ సినిమా నే అని చెప్పాలి. 1997 లో రిలీజ్ అయిన ఈ ఇంగ్లీష్ సినిమా ఇప్పటికీ ఒక క్లాసిక్ గా మిగిలిపోయింది. అమెరికా లోని నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ లో కూడా చోటు చేసుకుంది. 1912 వ సంవత్సరం లో సంభవించిన ఒక షిప్ రెక్, ఎంత పాపులర్ అంశమో అందరికీ తెలుసు. ఐస్ బెర్గ్ కి గుద్దుకుని మునిగిపోయిన టైటానిక్ ఓడ లోని ప్రయాణీకుల మనో భావాల్ని ఎంతో చక్కగా ఊహించి ఈ సినిమా దర్శకుడు జేంస్ కామెరున్ సినిమా గా రూపొందించడం ఒక గొప్ప అనుభూతిని అందించింది ప్రేక్షకులకి. ఒక రకంగా వాళ్ళ లోకి పరకాయ ప్రవేశం చేశాడు అని చెప్పాలి. ఓడ ప్రమాదం నుంచి బయటపడి,ముసలితనం లో ఉన్న కొందరిని ఈ దర్శకుడు కలిసి స్కెచ్ తయారుచేసుకున్నాడు. దానికి మంచి ప్రేమ కథని జోడించాడు.అది కూడా చాలా సహజం గా ఓడ ప్రయాణం లో సాగిపోతూంటుంది. జాక్ డాసన్,రోస్ అనే ప్రధాన పాత్రలు అవి. అప్పటికే ఎంగేజ్మెంట్ ఐంది విలన్ తో,ఈ ప్రయాణం లో హీరో కలవడం.విలన్ ఊరకనే ఉంటాడా...అతని ప్రయత్నాలు అతనివి.టికెట్ కి లాటరి కొట్టి చివరి క్లాస్ లో ఉండే హీరో మరి హీరొయిన్ ని ఎలా ప్రేమ లో దించాడు..ఆ తర్వాత ఓడ ఐస్ బెర్గ్ కి గుద్దుకోవడం ...చావు అంచుల్లోకి నెట్టబడ్డ ప్రయాణీకుల వ్యథలు,గాథలు మనల్ని ఎక్కడికో తీసుకుపోతాయి. ముఖ్యంగా ఓడ లోని ఇంటీరియర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఆనాటి రోజుల్లోకి మనల్ని తీసుకుపోతాయి.ఆ గ్రాండ్ స్టైర్ కేస్ చాలా ప్రత్యేకం గా నిలిచిపోతుంది.ఓడ ని తయారు చేయడం లో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు.ఆ నైపుణ్యం అంతా సినిమా తెర పై కనిపిస్తుంది.సినిమా మొత్తాన్ని ,ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ ముసలామె చెబుతూంటుంది.ఆ రోజుల్లో తను యవ్వనం లోని రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ సినిమా ని నడిపిస్తుంది. 200 మిలియన్ డాలర్ లతో తీసిన ఈ చిత్రం రెండువేల మిలియన్ డాలర్ల కి పైగా వసూలు చేసింది.11 అస్కార్ అవార్డ్ ల్ని పొందింది. చిత్రం లోని సంగీతం అలరిస్తుంది.థీం మ్యూజిక్ ప్రతి చోటా వినిపించేది.ఈ ఓడ లోని ఇంటీరియర్స్ ని తయారు చేసిన మెక్సికో ,బ్రిటన్ కళాకారులు అభినందనీయులు.పీటర్ లేమంట్ వారి నాయకుడు.లియోనార్డో డీకాప్రియో కి,కేట్ విన్స్లెట్ కి గొప్ప పేరుని తెచ్చింది.అనేక భాషల్లోకి డబ్బింగ్ ఐ కనక వర్షం కురిపించింది. ----- NewsPost Desk
Post Date: Sun, 30 Oct 2022 12:18:31 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger