Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 16 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౨(682) - Aditya Srirambhatla

( నారాయణ‌ఋషి భాషణ ) 11-63-క. ధర్ముండు దక్షపుత్త్రిక నిర్మలమతిఁ బెండ్లియాడి నెఱిఁ బుత్త్రుని స త్కర్ముని నారాయణ ఋషి నర్మిలిఁ గనె నతఁడు బదరికాశ్రమ మందున్‌. 11-64-తే. అట్టి నారాయణాహ్వయుం డైన మౌని బదరికాశ్రమమందు నపార నిష్ఠఁ దపముఁ గావింప బలభేది దలఁకి మదిని మీనకేతను దివిజకామినులఁ బనిచె. భావము: బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=64 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Wed, 16 Nov 2022 16:18:17 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger