Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 19 November 2022

శ్రీకృష్ణ విజయము - ౬౮౫(685) - Aditya Srirambhatla

( నారాయణ‌ఋషి భాషణ ) 11-68-సీ. "దేవమునీంద్ర! నీ దివ్యచారిత్రంబు- నెఱిఁగి సన్నుతిసేయ నెవ్వఁడోపుఁ? బుత్త్ర మిత్ర కళత్ర భోగాదులను మాని- తపము గావించు సద్ధర్ములకును విఘ్నముల్‌ సెందునే? విశ్వేశుఁ గొల్చిన- యతనికి నంతరాయంబు గలదె? కామంబుఁ గ్రోధంబుఁ గల తపస్వితపంబు- పల్వలోదకములభంగిఁ గాదె? 11-68.1-తే. నిన్ను వర్ణింప నలవియే? నిర్మలాత్మ! రమణ లోఁగొను మా యపరాధ" మనుచు సన్నుతించిన నతఁడు ప్రసన్నుఁ డగుచుఁ దనదు సామర్థ్య మెఱిఁగింపఁ దలఁచి యపుడు. భావము: "దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు." అని నుంతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=68 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : .
Post Date: Sat, 19 Nov 2022 16:02:51 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger