ర చన పాఠకుల చేతు(త)లలోనే మన్నన పొందుతుంది. అందుకు ఆ రచనను పాఠకుల చెంత నిశ్చలంగా నిలపాలి. అందుకు తగ్గ స్థితి, గతి రచనకు ఒబ్బిడిగా కుదరాలి. కానీ నేటి రచన చిరు జల్లు మాదిరిగా పాఠకులను తడిపి పోతుంది. అందుకు కారణంగా రచనకు అచ్చు రూపం మృగ్యం కావడమే. కారణాలు ఏమైనప్పటికీ నేటి రచనలకు ప్రింట్ మీడియా కరువు అవుతుంది. గతంలా దిన, వార, పక్ష, మాస, వగైరా పత్రికలు రచనకు దక్కడం/అందడం లేదు. రచనకు అచ్చు రూపం లేక విలవిలాడి పోతుంది. ఎలక్ట్రానిక్ మీడియా ఎంతగా విస్తరిస్తున్నా అది రచన మనుగడకు మాత్రం అంతంత సాయంగానే అగుపిస్తుంది. అప్పటి మాదిరిగానే రచనలకు పాఠకులు ఇప్పుడూ ఉన్నారు. కానీ వాళ్ల చూపులు అంతగా ఎలక్ట్రానిక్ మీడియా వైపు పోవడం లేదు. అందుకే నేడు వచ్చిన రచన ఉసూరు మంటుంది. ఒక రైటర్ గా నా తర్కాలు ఇవి. అలాని ఎలక్ట్రానిక్ మీడియా తగనది అనను. అది ఒక రచనకు అచ్చు మాదిరికి తుల్యంగా గతం మంది పాఠకులను అందించలేక పోతుందని మాత్రం అనగలను. అందుకే నేటి తీరుకు సమంగానే నా రచనాభిరుచిని ఎలక్ట్రానిక్ మీడియాలో కొనసాగిస్తూనే అచ్చు మాదిరిని మెచ్చిన నేను అందుకు తగ్గట్టు నా రచనలను పాఠకులకు ప్రింట్ మీడియా రూపంలో కూడా చేరువ చేస్తున్నాను. అప్పటి అచ్చులో వచ్చిన నా రచనలను నేటికీ అతి సరళంగా పాఠకుల చేరువన నిలిపిన నేను, ఇప్పటి ఎలక్ట్రానిక్ మీడియా ల్లోని నా రచనల్లో కొన్నింటిని పుస్తక రూపంలో పాఠకుల చెంత నిలిపే యత్నం చేపట్టాను. నా ప్రయత్నంకు మాతృభారతి, స్టోరీ మిర్రర్, హెచ్ యస్ ఆర్ ఎ పబ్లికేషన్స్ వారు చేయూత అందించారు. వారి మూలంగా నా రచనలను పుస్తక రూపాల్లో పాఠకులకు అందించగలుగుతున్నాను. అలాగే నా రచనల పుస్తక రూపాలకు తను గీసిన చక్కని చిత్రాలతో తుంబలి శివాజీగారు సహకరిస్తున్నారు. అలాగే నా రచనల పుస్తక రూపాలను పాఠకులకు అందించడంలో అమెజాన్, ప్లిప్ కార్ట్ లతో పాటు కొన్ని సాహితీ సంస్థలు సహకరిస్తున్నాయి. ఇలా నా రచనల పుస్తక రూపాలకు కారకులైన వీరందరికీ మరియు మరింత ముఖ్యంగా ఈ నా పుస్తక రూపాలను తమ అక్కున చేర్చుకుంటున్న పాఠకులకు ఈ సమయంన నా మనసారా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఏమైనా రచనా పుస్తకం పాఠకుల అరచేతులలో అచ్చంగా ఒక పసికూనలా, ఒక ప్రియురాలు మోములా సదా కదలాడాలని ఒక రచయితగా ఆశిస్తుంటాను. ***
Post Date: Mon, 28 Nov 2022 04:56:21 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 28 Nov 2022 04:56:21 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment