Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 12 November 2022

అనాయాసేన మరణం - sarma

అనాయాసేన మరణం వినా దుఖేఃన జీవితం. అనాయాసేన మరణం వినా దుఖేఃన జీవితం. ప్రయాసలేక జీవితం ముగించడం,శోకం లేక జీవించడం అన్నవి బహుశః పూర్వ జన్మ సుకృతాలే! అనాయాసంగా మరణించచ్చుగాని దుఖః లేక జీవితం గడవదు. రోజూలాగే ఉదయమే నడుస్తున్నాం, అందరం. ఎవరి కార్యక్రమం వారు చేస్తున్నారు. నేను ప్రాణాయామానికి కూచుంటున్న సమయం. ఒక్క సారిగా కలకలం, ఒకరెవరో పక్కనే ఉన్న టెన్నిస్ క్లబ్ కి పరుగెట్టేరు. ఏమయింది తెలుసుకునేలోగానే దుర్వార్త, ఒక వాకర్ నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతే, వెనకవారు  ప ట్టుకుంటే, పక్కవారు, కేంపస్ లోనే టెన్నిస్ ఆడుతున్న డాక్టర్ గారికోసం పరుగెడితే, వారొచ్చి, ప్రథమచికిత్స చేసినా ఉపయోగం లేక హంస లేచిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. వాకర్లంతా నిలబడిపోయాం, బిక్కచూపులు చూస్తూ. పెద్దలం త  అక్కడే వుండటంతో క్షణాలలో పార్థివ శరీరాన్ని తరలించడానికి వేన్ ని చెప్పడం, కావలసినవారికి కబుర్లు చెప్పడం జరిగిపోయాయి. జరిగినదానికి దిగ్భ్రాంతి చెందిన వాకర్లంతా కర్తవ్యా విమూఢులై నిలబడిపోయాం. మా వూళ్ళో పార్థివ శరీరాలని శ్మశానానికి చేర్చడానికి ఇబ్బందులు లేకుండేందుకు ఇప్పటికే రెండు సంస్థలు రెండు వేన్లు నడుపుతున్నాయి.  అరగంటలో పార్థివ శరీరాన్ని తరలించిన తరవాత చైతన్యం పొంది కదిలాం, పోయిన వారెవరో తెలియదు, ముఖ పరిచయం తప్ప. ఎవరైనా వారి ఆత్మ పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకుంటూ. ఓం శాంతి! శాంతి!! శాంతిః!!!
Post Date: Sat, 12 Nov 2022 03:34:01 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger